కవితలు పోటీ
అర్థం లేని ప్రశ్న
కనులు తెరిచి తరచి చూచినంత
కనుదోయి నవ్వ ప్రయత్నించ
ఎదురు తిరిగి పలకరించ
యద చిన్నబోయె చిరు సిగ్గుతో
ఏమిటో నిన్నటి సొబగులు
నేడు కత్తుల రూపం దాల్చే
మానవీయతలో మానవత్వం
లోపమా, మమకార బంధాల
విచళిత గుణమా, ఏది మార్పు
ఏది చేర్పు, ఎచటికీ సుదీర్ఘ
ప్రయాణం, అందనంత దూరమా?
అందుకోలేని దూరమా?
అర్థం కాని, అర్థం లేని ప్రశ్న
పరంపరలు, చేదామన్నా
ప్రయత్నం చేజారుతోంది
పలుకు బిగుసుకుంది
మౌనం మరులు పొందే
చేతలు చచ్చుబడినా
జీవితం చేరేదెక్కడికి
అంతులేని ప్రశ్న?....
.కె.కె.తాయారు