తీయని అనుబంధం
అమ్మ నాన్నల అనురాగం అన్న
చూపించే ప్రేమ సుమధురం
ప్రతి ఏడాదికి ఒకసారి జరుపుకునే
అనుబంధాలకి నిలియం ఈ రాఖీ పౌర్ణమి
తెల్లవారుజామునే లెగిసి అందరూ
చుట్టాలు ఎంతో కలిసి ఆనందంతో
జరుపుకునేదే ఈ రాఖీ పౌర్ణమి
అమ్మానాన్నల తర్వాత అన్న
చూపించే ప్రేమ కమ్మదనం అన్న
ఎప్పుడూ మనల్ని చల్లగా చూడాలని
ప్రేమతో ముడి వేసి అనురాగ బంధం
చెల్లి అయిన అక్కయినా ప్రతి ఇంట్లో
అన్నయ్య తమ్ముడైన రాఖీ కట్టి జీవితాంతం
నన్ను కాపాడు అని తెలియపరిచేది ఈ రాఖీ బంధం
జీవితాంతం నీకు తోడు ఉంటానని కాపాడేది
ఈ అనురాగ అనుబంధాల
స్కంద పురాణాల్లో ఈ పండగను
మనకి తెలియపరచిందే ఈ రక్షాబంధన
-భాను శిరీష