ఓ హృదయం లేని మనిషీ
ఓ హృదయము లేని మనిషీ!
నీకన్న కదలని వృక్షంబు మేలు
కసిగా కొట్టినా పెరిగిన కొమ్మలు
ఇచ్చుటకే చూచు రుచికర ఫలాలు
చల్లనిగాలివీచు రెమ్మల విసనికర్రలు
చక్కని నీడనిచ్చు రెమ్మల గుబురులు
సంగీతకచేరీపెట్టు కోయిల కూతలు
నీకుళ్ళు తాను పీల్చి నీకిచ్చు ఆక్సిజన్ ధారలు
నీరుపోయకున్నా నీ బాగుకే కంటుంది కలలు
మొక్కనాటు మనుజా ఇస్తుంది వానజల్లులు
చితిమంటతానై తీరుస్తుంది నీ చింతలు
-ఉపద్రష్ట సుబ్బలక్ష్మి