చెల్లెమ్మకు అన్నతోడు
తల్లిదండ్రుల తర్వాత ఒక
అమ్మాయికి అండగా ఉండేవారు అన్నతమ్ములే.
అన్నతమ్ములే జీవితకాలం
ఆమెకు అండగా ఉంటారు.
తల్లిదండ్రులు పెద్దవారు అవటం వల్ల వారు త్వరగా
ఆమెను వదిలి తిరిగిరాని
లోకానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమెను అక్కున
చేర్చుకుని ఆదుకునేవారు
అన్నదమ్ములే. దాదాపు
సమ వయస్కులు అవటం
వల్ల అన్నా చెల్లెళ్ళ మధ్య
ఎక్కువ ఆప్యాయత మనకు
కనపడుతుంది. రక్త సంబంధానికి మించిన
బంధం ఉండదు.
కొట్టుకున్నా,పోట్లాడుకున్నా
అన్నా చెల్లెళ్ళ బంధం ఏమాత్రం
విడదీయలేనిది. అన్న అంటే
అమ్మానాన్నల అంశ కాబట్టి
తండ్రిలా రక్షిస్తూ, తల్లిలా ప్రేమను పంచుతాడు అన్నయ్య.
-వెంకట భానుప్రసాద్ చలసాని