బ్రహ్మ చెముడు అనే పదం ఎలా వచ్చింది?
మనవాళ్ళు బొత్తిగా వినపడని వారిని అబ్బ ఆయనకు బ్రహ్మ చెముడండీ అంటూ వుంటారు.ఆ కథా కమామిషూ ఏమిటో తెలుసుకుందామా?
బ్రహ్మదేవుడికి చెముడు రావట మేమిటని ఆశ్చర్య పోతాము.వాస్తవానికి యిది ఆయనకు వచ్చిన చెముడు కాదు.ఆ పదప్రయోగం రావటానికి కారణం మరో విధంగా వుంది
ఇది నాటక సమాజం వాళ్ళు పౌరాణిక నాటకాలు ప్రదర్శించే కాలం లో పుట్టింది.
ఎలాగంటే-
ఒకనాటకం లో తన ప్రియ భక్తునకు మెచ్చి అతను కోరిన వరాన్ని యివ్వటానికి
పైనుంచి క్రిందికి వచ్చి "భక్తా!నీ భక్తికి మెచ్చి వచ్చితిని,యే వరము కావాలో కోరుకో " అనే డైలాగ్ చెప్పాలి.
ఆ వేషం వేసే వ్యక్తికీ అక్షర జ్ఞానం లేదు.ఎవరైనా పక్కనుంచి అందిస్తే చెప్తాడు.అతను నాటకానికి ఎక్కువ విరాళము యిచ్చినందు వల్ల నాకు బ్రహ్మ వేషమే కావాలని పట్టుబట్టి నందువల్ల అతనికి ఆ వేషం తప్పనిసరిగా యివ్వ వలిసి వచ్చింది.అతనికి బ్రహ్మ వేషం
అతనికి బ్రహ్మ వేషం వేశారు.
.ఇంత కాలానికి మన కులపోడు బెమ్మ యేసికం యేత్తన్నాడు యెల్దామ్ రండహే
అంటూ దూరపు చుట్టాలందరూ నాటకం చూడ్డానికి బండ్లు కట్టుకొని వచ్చారు.
నాటకం ప్రారంభమైంది.బ్రహ్మ వేషధారి పేరు చెప్పగానే పట్టరాని ఆనందం తో ఈలలూ,చప్పట్లూ,చిందులూ మొదలయ్యాయి.కొంతమంది తెరవేనక్కు వచ్చి తొంగి చూసి మనోడు బెమ్మ యేసానికి బలే కుదురు కున్నాడురా అంటూ మురిసి పొయ్యారు.
బ్రహ్మ గారిని పై నుంచి క్రిందికి తేవడానికి అతన్ని తాళ్ళతో కట్టేసి తెరవెనక పైకీ కిందికీ
తిరిగేలా ఒక గిలక (పుల్లీ)అమర్చి ఏర్పాటు చేశారు.
భక్తుడు తన డైలాగు అదర గొట్టేశాడు."తండ్రీ! ఆర్తజన రక్షకా! విధాతా!రా దివి నుండి
భువికి దిగిరా" అంటూ మోర పైకెత్తి చేతులుసాచి వేడుకుంటున్నాడు.ప్రేక్షకులు భక్తి
పారవశ్యం తో వూగిపోయ్యారు.
.బ్రహ్మదేవుడిని మోకులతో పైనుండి క్రిందికి దించారు.
బ్రహ్మ భక్తునితోభక్తా నీ భక్తికి మెచ్చితిని ఏమి వరం కావాలో కోరుకో అని చెప్పాల్సిన డైలాగును పక్కనుంచి చెప్తున్నా బ్రహ్మ వేషధారి దాన్ని అందుకొని చెప్పకుండా
చిరునవ్వుతో అభయహస్తం చూపిస్తూనే వున్నాడు.
పక్కనుంచి డైలాగు చెప్పేవాడు,,దర్శకుడూ తలలు బాదుకుంటూ వుంటే బ్రహ్మ చిరునవ్వుతో అభయహస్తం పెట్టి వూరికే చూస్తున్నాడు.ఇంతలో ప్రేక్షకులు గొడవ చేశారు.ఈలలతో అదరగొట్టేశారు. తెర దించి డైలాగు ఎందుకు చెప్పలేదని అడిగితే నాకు వినపడలేదు అన్నాడు.ఇంతకీ జరిగిందేమిటంటే బ్రహ్మ కు పెట్టిన కిరీటం అతని చెవులని కప్పేసి వుండడం వల్ల డైలాగులు వినపడలేదు.అప్పటినుండీ బ్రహ్మచెముడు' అనే మాట వ్యవహారం లోకి వచ్చింది.