ప్రణవ్

ప్రణవ్

ప్రణవ్

ప్రణవ్ కి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు తల్లి కాస్త మతిస్థిమితం లేకుండా ఉంటుంది. తండ్రి చనిపోయాక వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి చేరుకున్నారు అక్కడ ఇద్దరు మామయ్యలతో ఉంటూ ప్రణవ్ చదువుకుంటూ ఉండేవాడు తల్లేమో ఒక చిన్న స్కూల్లో ఆయాగా పనిచేసేది
.
ప్రణవ్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న సిస్టం అంటే కంప్యూటర్ ఉండేది ప్రణవ్కి ఆ కంప్యూటర్ పట్టుకోవాలని ముట్టుకోవాలని చాలా కోరికగా ఉండేది కానీ చిన్నపిల్లడు పైన వేసుకుంటాడు అని వాళ్ళ మామయ్యలు ఎక్కువగా ముట్టుకొని ఇచ్చేవారు కాదు.

కానీ ప్రణవ్ అల్లరి పిల్లవాడు కాబట్టి మామయ్యలు లేని సమయంలో ఆ కంప్యూటర్తో ఎన్నో ఆటలు ఆడుతూ ఏవేవో నేర్చుకుంటూ ఉండేవాడు. అలా ప్రణవ్ ఎనిమిదో తరగతికి వచ్చాడు ఎనిమిదో తరగతిలో వాళ్ల కంప్యూటర్స్ టీచర్ చెప్పినట్లుగా క్లాసులో విని ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు.

అలా ప్రాక్టీస్ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే కంప్యూటర్ పై చాలా గ్రిప్ వచ్చింది కానీ ఈ విషయం వాళ్ళ మామయ్యలకి గాని ఇంట్లో వాళ్లకు గాని తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా ఎలాగోలా వాళ్ళ కళ్ళు కప్పి కంప్యూటర్ టీచర్ చెప్పినట్టుగా అందులో అన్ని విషయాలు నేర్చుకున్నాడు అప్పుడే అతనికి ఫేస్బుక్ ట్విట్టర్ల గురించి తెలిసింది.

అందులో ఎలా లాగిన్ అవ్వాలి అనేది మాత్రం తెలియలేదు తనకన్నా పెద్ద వాళ్లను అడిగి అందులో ఏలా లాగిన్ అవ్వాలి ఇలా మెయిల్ క్రియేట్ చేయాలి అనేది తెలుసుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన కంప్యూటర్లో తనకన్నా పెద్ద వాళ్ళు చెప్పినట్టు మెయిల్స్ అన్ని క్రియేట్ చేసుకుని ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే ఫేస్బుక్ ట్విట్టర్ చూస్తూ ఉండేవాడు.

అయితే ఒక రోజు అతనికి ఒక అడ్వటైజ్మెంట్ కనిపించింది అందులో ఏముంది అంటే ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైనా బగ్ కనిపెడితే కోటి రూపాయలు బహుమతి వస్తుంది అనేది ఆ అడ్వర్టైజ్మెంట్ సారాంశం.

దాంతో ప్రణవ్ ఎలాగైనా దాన్ని సాధించాలని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా వెంటనే స్కూల్ నుంచి రాగానే ఫేస్బుక్ ట్విట్టర్ వెతుకుతూ ఉండేవాడు సాయంత్రం మామయ్యలు రాగానే వెంటనే అది మూసేసి చదువుకుంటున్నట్లు నటించేవాడు.

ఇలా కొన్ని రోజులు గడిచాయి కానీ ప్రణవ్ కి ఎక్కడ ఏ బగ్గు కనిపించలేదు. అయినా నిరాశ చెందకుండా వెతుకుతూనే ఉన్నాడు వెతుకుతూనే ఉన్నాడు రాత్రి అందరూ నిద్ర పోయిన తర్వాత కూడా తను ఒక్కడు మేల్కొని మరి ఏ శబ్దం రాకుండా వెతుకుతూ అలా ఒక బగ్గుని కనిపెట్టాడు అది ఎలా మెయిల్ చేయాలి అనేది మాత్రం అతనికి తెలియలేదు..

ఇక ఇప్పుడు అన్నాను కాకుండా మామయ్యలకు చెప్పాల్సిన సమయం వచ్చింది. ఒక ఆదివారం మామయ్యలు ఇంట్లో ఉన్నప్పుడు మెల్లిగా మామయ్య దగ్గరికి వెళ్ళాడు ప్రణవ్..

ఎప్పుడు తమ దగ్గరికి రాని ప్రణవ్ తమ దగ్గరికి రావడంతో ఏమైంది బ్రో? ఏం కావాలి బుక్స్ ఏమైనా కావాలా అంటూ మామయ్యలు అడిగారు. కానీ ప్రణవ్ వాళ్ళిద్దర్నీ సిస్టం ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఇదేంటి ఏమీ మాట్లాడకుండా మమ్మల్ని సిస్టం దగ్గరికి ఎందుకు తీసుకువెళ్తున్నాడు అంటూ ఆశ్చర్యపోయారు..

ప్రణవ్ గబగబా సిస్టం ఆన్ చేయడం టకటక కీబోర్డుపై రైలు కదుపుతూ ఫేస్బుక్ ని ఓపెన్ చేసి చూపించడం చూపిస్తూ వాళ్ళిద్దరికీ తాను చేసిన పనిని చెప్పడం మాత్రం ఆపకుండా చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు అది చూసి ఆశ్చర్యపోయారు.

ఒక ఎనిమిదో తరగతి చదివే పిల్లవాడు మాకు తెలియకుండా సిస్టం ఎప్పుడు వాడాడు అసలు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నాడు ఇంత సాంకేతికత పరిజ్ఞానం ఇతనికి ఎలా వచ్చింది. అంటూ ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు.

వెంటనే మామయ్యలు ఇద్దరు ఆ బగ్ ను కనిపెట్టిన ప్రణవ్ నీ మెచ్చుకొని, వెంటనే ఆ సంస్థ వారికి మెయిల్ పెట్టారు. అలా మెయిల్ పెట్టడంతో ప్రణవ్ డబ్బులు గెలుచుకున్నాడు.

ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించారు వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఇంకా మంచి సిస్టం కొనిస్తే ఇంకా బాగా సాంకేతికత నేర్చుకుంటాడు అంటూ ఒక మంచి సిస్టన్ని కొనిచ్చారు. దాంతో ప్రణవ్ ఫోటోషాప్ ఎడిటింగ్ అంటూ చాలా నేర్చుకున్నాడు. సాంకేతికత మీద పట్టు సాధించాడు..

అతి చిన్న వయసులోనే సాంకేతికత మీద పట్టు సాధించిన ఘనుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రణవ్.

పిల్లలకి ఏది ఇష్టమో అది కనుక్కొని చేయాలి తప్ప, చదువు ,చదువు అంటూ వెంట పడకూడదు. ర్యాంకుల కోసం పిల్లలని మానసిక ఒత్తిడికి గురి చేయకూడదు.

 

-భవ్యచారు

మార్నింగ్ వాక్ ప్రహసనం Previous post మార్నింగ్ వాక్ ప్రహసనం
కావిడి బరువు Next post కావిడి బరువు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close