మరీచిక - వెంకట భానుప్రసాద్ చలసాని

Comments · 217 Views

మరీచిక వెంకట భానుప్రసాద్ చలసాని

మరీచిక

ఎడారిలో నడిచేటప్పుడుకొన్ని ప్రాంతాల్లో నీటి చెలమలేకపోయినా నీటి చెలమ దగ్గరలో ఉన్నట్లు మనకుభ్రమ కలుగుతుంది. నిజానికిఅక్కడ నీరు ఉండనే ఉండదు.

ఆ మరీచికను చూసి చాలామంది భ్రమపడుతూ ఉంటారు. జీవితంలోకూడా ఇలాంటి భ్రమలు
కలుగుతుంటాయి.

చాలామంది అలాంటి భ్రమల్లోనేబతికేస్తూ ఉంటారు. భ్రమలుమనిషిని తప్పుదోవ పట్టిస్తూ
ఉంటాయి.

మనకు వాస్తవాల్ని తెలియజేసే అనుభవజ్ఞులైనవ్యక్తుల సలహా, సహకారాలుతీసుకోవటం వల్ల మనం ఆ
భ్రమలనుండి బయటపడగలం.

అలా వారి నుండి సలహాలు తీసుకోవడానికి మనం ఏమాత్రం మొహమాట పడకూడదు. ఎలాగైతే
ఎడారిలో నివసించే వారికి ఈ ఎండమావుల గురించిఅవగాహన ఉంటుందో.

మన చుట్టూ ఉండే కొంతమందికి ఈ భ్రమల గురించిఅవగాహన ఉంటుంది. వాటి నుండి బయటపడే నైపుణ్యం ఉంటుంది.

అలాంటి వారినిగుర్తించి, వారి సలహాలుతీసుకుంటేనే మనం మన జీవితంలో ముందడుగు
వేయగలం.

-వెంకట భానుప్రసాద్ చలసాని

Comments