కాల భ్రమణం- భవ్యచారు

Comments · 198 Views

కాల భ్రమణం,bhavyacharu, kalabhrabhanam by bhavyacharu, bhavayacharu kalabramanam in aksharalipi

కాల భ్రమణం

అబ్బబ్బా ఈవిడ చాదస్తం భరించలేకపోతున్నాం. చేసిన పనే మళ్లీ మళ్లీ చేయమంటూ నన్ను జీవచ్ఛవంలా మార్చేస్తుంది నా శక్తిని అంతా కడగడం తుడవడానికి సరిపోతుంది ఇంకా సరదాలు సంబరాలు ఎక్కడ నా మొహానికి ఇంకా అవి కూడానా ఈయన అంటే తల్లి మాట జవదాటడు తల్లి ఏది చెప్పినా చెప్పింది చెయ్యి అంటూ తేలిగ్గా తీసుకుంటాడు కానీ నా బాధను అర్థం చేసుకోడు అంటూ వాపోయింది పార్వతి పక్కింటి పంకజంతో...

అవునమ్మా నేను చూస్తూనే ఉన్నాను చేసిందే చేయడం అనడం నిన్ను రాచి రంపాన పెడుతోంది నీ మొగుడితో చెప్పి వేరు కాపురం పెట్టించలేకపోయావు అంటూ అగ్నిలో ఆజ్యం పోసింది పంకజం.

ఆ తర్వాత ఎలాగో భర్తను ఒప్పించి పార్వతి వేరు కాపురం పెట్టింది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత. పిల్లలు పుట్టాక వాళ్ళ సవరింపులు వాళ్ళ చదువులతో కాలమీట్టే గడిచిపోయింది ఇద్దరు పిల్లలు పెద్దగయ్యారు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.

పార్వతి శ్రీధర్ ఇద్దరు దాదాపు ముసలి వాళ్ళ అయ్యారు అత్తమామల పోరు పార్వతికి ఇప్పుడు లేదు వాళ్లు కూడా కాలం చేశారు. పార్వతీ శ్రీధర్ ని పిల్లలకు పెళ్లి చేయమని కోరుతూనే ఉంది..

ఆ క్రమంలో శ్రీధర్ మొదటి అబ్బాయికి తన స్నేహితుడి కూతురినిచ్చి వివాహం చేయడానికి ఒప్పుకున్నాడు శ్రీధర్. శ్రీధర్ కొడుకు మహేష్ కూడా అమ్మాయిని చూసి ఇష్టపడడంతో నిశ్చితార్థం, పెళ్లి కూడా వెంటనే జరిపించారు.

కొత్త కోడలు ఇంటికి వచ్చింది అని సంబరపడింది పార్వతి ఇక తాను రెస్టు తీసుకోవచ్చని బాధ్యతలు తన కోడలు అప్పగించాలని అనుకొని కొత్తకోడల్ని పిలిచి అన్ని పనులు అప్పగించింది.

కానీ కొత్త కోడలు ఈతరం అమ్మాయి కావడంతో ఆమెకు సరిగా వంట వార్పులు రాకపోవడంతో పార్వతీ ఆమెకి అన్ని నేర్పవలసి వచ్చింది. కోడలు కాస్త అన్ని నేర్చుకున్న తర్వాత పార్వతి పక్కకు తప్పుకుంది.

ఇక ఇంటి బాధ్యతలు వంట బాధ్యతలన్నీ కొత్త కోడలు చూసుకోవడం మొదలుపెట్టింది దానికి పార్వతి ఎంతో సంతోషించింది తన అత్తగారి లాగా తాను తన కోడల్ని కష్టపెట్టలేదని సంతోష పడింది పైగా అన్ని దగ్గరుండి నేర్పించాలని తనలో తాను ఎంతో ఆనంద పడింది.

***********

ఓ రోజు అర్ధరాత్రి ఏమో గుసగుసలు వినిపించడంతో పార్వతికి చటుక్కున మెలకువ వచ్చింది. ఈ అర్ధరాత్రి సమయంలో ఎవరు మాట్లాడుకుంటున్నారని లేచి వెళ్లి ఆ మాటలు ఎక్కడ నుంచి వస్తున్నాయా అని చూడ సాగింది.

ఆ మాటలు తన కొడుకు గదిలోంచి వస్తున్నాయి అని గమనించడానికి ఎక్కువసేపు పట్టలేదు పార్వతికి. ఈ రాత్రి వీరికి మాటలు ఏంటి హాయిగా సంసారం చేసుకోక అని అనుకుంటూ కుతూహలంతో ఆ మాటలన్నీ వినసాగింది.

కొత్త కోడలు విష్ణు ప్రియ మహేష్ తో ఏంటండీ నాకు ఈ పంజరం బతుకు కాస్తయినా విశ్రాంతి లేకుండా 24 గంటలు మీ అమ్మగారు నాతో పని చేయిస్తున్నారు. అబ్బబ్బ చెప్పిందే చెప్పడం చేసిందే చేయడం కడిగిందే కడగడం చేయిస్తూ విన వెనకాలే ఉంటూ నాకు ప్రైవసీ లేకుండా చేస్తున్నారు.

కాసేపు రెస్ట్ తీసుకుందామని అనుకున్నా కూడా రెస్టు తీసుకొని ఇవ్వకుండా ఇల్లు శుభ్రంగా పెట్టుకోమని అంటున్నారు ఏవైనా పండగలు పబ్బాలు వస్తే ఇల్లు శుభ్రం చేసుకుంటారు అంతేగాని ఇలా రోజు శుభ్రం చేసుకుంటారా ఎవరైనా,
నేను ఇదంతా భరించలేనండి మనం వేరు కాపురం పెడదాం ఎక్కడైనా ఫ్లాట్ అద్దెకి చూడండి కావాలంటే నేను కూడా ఉద్యోగం చేస్తాను ఇద్దరం కలిసి ఉండొచ్చు ప్రశాంతంగా అంటున్న కోడలు మాటలు వింటున్న పార్వతి ఉలిక్కిపడింది.

తన అత్తగారు తనను వేధించినప్పుడు తనకు పనులు చెప్పినప్పుడు, తాను ఎలా అనుకుందో ఇప్పుడు తన కోడలు కూడా అలాగే అనుకోవడం అలాగే మాట్లాడడం వేరు కాపురం పెడతాను అనడం ఇవన్నీ తన మాటలే.

కానీ తనకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది తన అత్తగారు చనిపోయాక ఆమె విలువ తెలిసి వచ్చింది. ఎందుకు పనులు చేసుకోమన్నదో ఎందుకు చెప్పిందే చెప్పి చేసిందే చేయమని చెప్పిందో అర్థం అయ్యి చాలా బాధపడింది అనవసరంగా ఆమెని తిట్టుకున్నానని కానీ ఇప్పుడు తన కోడలు కూడా తనలాగే ఆలోచిస్తుంది,

ఆలోచించని ఆలోచించని తన వయసు వచ్చాక తన విలువ తన కోడలికి తెలిసి వస్తుంది కాబోలు కాలభ్రమణం అంటే ఇదేనేమో అని అనుకుంటూ తన గదిలోకి వెళ్లి పడుకుంది ఏ ప్పట్ల.

తెల్లవారి భర్తతో కలిసి వెళ్లి ఒక మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకుంది. అన్ని విధాల మంచి లోకాల్తీలో అద్దెకు తీసుకొని ఆ ఫ్లాట్ తాళాలను తీసుకొని తిరిగి ఇంటికి వచ్చారు.

అప్పటికే మహేష్ ఇంట్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు తల్లిదండ్రులకు ఆ విషయం ఎలా చెప్పాలో అన్ని సతమతమవుతూ, వీళ్ళిద్దరూ రావడం చూసి ఏంటమ్మా పొద్దున్నే చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్లారు అంటూ అడిగాడు.

దానికి పార్వతీ నవ్వుతూ పర్సులోంచి తాళాల గుత్తి తీసి మహేష్ చేతిలో పెట్టి ఈరోజు నుంచి నువ్వు నువ్వు నీ భార్య ఈ ఇంట్లో ఉండండి మీ సామాన్లు సర్దుకోండి అంటూ చెప్పింది ఏంటమ్మా ఇది అంటూ అడిగాడు మహేష్.

నీకు తెలిసి వస్తుంది లేరా బాధ్యతలు తెలియాల వద్ద అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పాడు శ్రీధర్. అవును మీ ఇద్దరికీ కూడా బాధ్యతలు తెలియాలనే మేము తీసుకున్నాం ఏమ్మా కోడలా ఇప్పుడు సంతోషంగా ఉందా అంది కోడలితో పార్వతి.

తమమాటలన్నీ విన్నది అని గ్రహించిన విష్ణుప్రియ అత్తగారి కాళ్లకు నమస్కరించి బట్టల సర్దుకోవడానికి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.

కాల భ్రమణం మళ్లీ మొదలైంది.

- భవ్యచారు

Comments