వాగ్దేవతలు

Comments · 228 Views

వాగ్దేవతలు వాగ్దేవతలు -బాలు

వాగ్దేవతలు

*తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :

"అ" నుండి "అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండం అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అని అర్ధం.

"క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని "సౌర ఖండం"అంటారు.

ఈ సౌరఖండం లోని "క, ఖ, గ, ఘ, జ్ఞ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత "కామేశ్వరి".! అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.

"చ, ఛ, జ, ఝ, ఞ" గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని".! అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.

"ట, ఠ, డ, ఢ, ణ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి "విమల".! అంటే మలినాలను తొలగించే దేవత.

"త, థ, ద, ధ, న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ".! కరుణను మేలుకొలిపేదే అరుణ.

ప, ఫ, బ, భ, మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని." అనగా జయము ను కలుగ చేయునది.

అలాగే "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని "అగ్ని ఖండం" అంటారు. అలాగే అగ్ని ఖండంలోని "య, ర, ల, వ" అనే అక్షరాలకు అధిష్టాన దేవత "సర్వేశ్వరి." అంటే శాశించే శక్తి కలది సర్వేశ్వరి.

ఆఖరులోని ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష" లకు అధిదేవత "కౌలిని"

ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు. ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని, క్రోమొజోములను ప్రభావితం చేస్థాయి.

అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది.

ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది.
అంటే బ్రహ్మమే శబ్దము.
ఆ బ్రహ్మమే నాదము.

మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.

అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది.

భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి "అమ్మ"ను అర్చిస్తున్నాయి.

కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.

మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత.

మనం చేసే శబ్దమే...ఆ దేవత..!

మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.

ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత.
ఇది సనాతన ధర్మం.
ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం.

శ్రీ మాత్రేనమః

సేకరణ

Comments