కాఫీజీవులు సి.యస్.రాంబాబు

Comments · 249 Views

సి.యస్.రాంబాబు కాఫీజీవులు సి.యస్.రాంబాబు కాఫీజీవులు సి.యస్.రాంబాబుకాఫీజీవులు సి.యస్.రాంబాబు

కాఫీజీవులు

కప్పు కాఫీ బ్రహ్మ దేవుడు లాంటిది
మనిషికి తను ప్రాణం పోస్తే
కాఫీ ఆలోచనకు రూపాన్నిస్తుంది

వేడి కాఫీ గొంతు దిగుతుంటే
ఉత్తేజం ఉరకలెత్తి
జడత్వం జూలు విదుల్చుకుంటుంది

కాఫీ చుక్క దొరక్క
విలవిలాడే నవనాడులు
చుక్క పడితే నవ్వుల పువ్వులు పూస్తాయి

అంతెందుకు
కాఫీరుచి నాలికపై నర్తిస్తుంటే
అక్షరవర్షం కురుస్తుంది

కాఫీ జీవుల్ని చిన్నచూపు చూడకండి
మీ జీవితాల్ని మార్చే మంచిమాట
అనుగ్రహించొచ్చు
ఏమో గుర్రం ఎగరావచ్చు
కాఫీజీవులు చిరంజీవులు

సి.యస్.రాంబాబు

Comments