ఉమా పార్వతి సత్యవతి ఆలపాటి

Reacties · 1025 Uitzichten

ఉమా పార్వతి సత్యవతి ఆలపాటి సత్యవతి ఆలపాటి ఉమాపార్వతి

ఉమా పార్వతి

శంభుని ప్రియ సతివై అలయగ ఈ మహినేలిన ఆదిలక్ష్మి ఉమా పార్వతి.

జగములనేలే జగదీశ్వరి కామాక్షి కాత్యాయని ఇలాతలముకు అలా దిగి రావమ్మా నీ పూజలు చేయగా ప్రియ సతులంతా వేచి ఉన్నారు ఉమా పార్వతి.

మంగళ గౌరీ శ్రీ మహాలక్ష్మి భువనేశ్వరి నిత్యం మాయింట నివసించవే నీకు చేసెదము పంచ మాంగల్యాల వ్రతము గైకొనవే హారతి ఉమా పార్వతి.

సిరిమాలక్ష్మీ అష్టైశ్వర్య ప్రధాయని ఆదిలక్ష్మి అమరగ ఇవ్వవే మాంగల్య శోభ పాడిపంటల సిరి సతతము పసుపు కుంకుమలతో చేసెద నీ పూజ ఉమా పార్వతి.

ఈశ్వరి వరదాయని జ్ఞాన వరముల నొసగే సరస్వతి విద్యాప్రదాయని అనయము నిను సేవించద మా మదిలో కొలువుండవే జ్ఞానవిపంచిమై ఉమా పార్వతి..

శ్రీ లక్ష్మీ వరలక్ష్మి ధరాధరమునేలే అర్ధనారీశ్వరి ఘనముగ వరముల నియ్యగా ఆదిశంకరునితో కూడి రావమ్మ ఈ పేదవారి ప్రసాదము స్వీకరించగా ఉమా పార్వతి..

- సత్యవతి ఆలపాటి

Reacties