సాయిచరితము
పల్లవి
సాయి దేవుని కీర్తించినచో
మనసుకు శాంతిని పొందెదమండీ
సాయి నామమే అండాదండా
సాయి చరితమే తోడూ నీడా
చరణం
సకల జీవులలో ఉండును సాయి
సాయము చేసే దైవము సాయి
ప్రేమను పంచే గుణమే సాయి
మానవత్వపు శిఖరము సాయి
చరణం
జీవనమార్గము కఠినము సాయి
ఆదుకునేందుకు రావా సాయి
మాలో ఐక్యత పెంచవ సాయి
మాకో మార్గము చూపవ సాయి
చరణం
మాటే వినదు మనసే సాయి
నీపై ధ్యానము నిలపగ సాయి
వరమే మాకు ఈయవ సాయి
మా ఆప్త బంధువు నీవే సాయి
చరణం
ఎన్ని జన్మల బంధము సాయి
ఆ ఎరుకే మాకు ఈయవ సాయి
దోషాలెన్నో ఉన్నవి సాయి
రూపుమాపగ రావా సాయి
సి.యస్.రాంబాబు
Venkata Bhanu prasad Chalasani 36 w
సాయి నామం అన్ని బాధలను తొలగించును.