ఆనందమే
ఉద్యోగం వచ్చిందా ఆనందమే
నచ్చిన పని చేస్తే బ్రహ్మానందం.
కష్టాలు గట్టెక్కితే ఆనందమే.
సుఖాలు వల్లనే బ్రహ్మానందం.
నేస్తం కలిస్తేనే కదా ఆనందం.
అందరూ కలిస్తే బ్రహ్మానందం.
ఆరోగ్యం బాగుంటేనే ఆనందం.
మనసు బాగుంటే బ్రహ్మానందం.
మంచి కధ చదివితే ఆనందం.
మంచి కధ వ్రాస్తే బ్రహ్మానందం.
ప్రకృతిలో విహరిస్తే ఆనందం.
మొక్కలు నాటితే బ్రహ్మానందం.
దేవుని దయ ఉంటే ఆనందమే.
పెద్దల ఆశీస్సులు ఊంటే నాకు బ్రహ్మానందం.
-వెంకట భానుప్రసాద్ చలసాని