బాధ్యతల
ఒకరింటికిపోకుండా
మనింటి లోనె తినగలుగుట ఆనందోబ్రహ్మ
పరులకు అపకారం తలపక
సరిగా కలిసి బ్రతకడమే ఆనందోబ్రహ్మ
తలిదండ్రులకు భారమవక
తలలో నాలికలా ఉంటే ఆనందోబ్రహ్మ
వృద్ధుల నవమానించక
పద్ధతిగా చూచుట ఆనందోబ్రహ్మ
హక్కులకొరకేపోరాడక
బాధ్యతల కోసంకూడా నిలబడటం ఆనందోబ్రహ్మ
పచ్చని చెట్టును కొట్టక
నిలబెట్టుట ఆనందోబ్రహ్మ
గంపెడుపూలకూరూరా తిరుగుచూ
చెట్లు పెంచేవారికి ఖాళీ చెట్లు చూపకపోవడం ఆనందోబ్రహ్మ
చక్కని పూవును దేవుని
పాదాల పెట్టుట ఆనందోబ్రహ్మ
-ఉపద్రష్ట సుబ్బలక్ష్మి