యుద్ధం
ఇప్పుడొక యుద్ధం కావాలి
ఇప్పుడొక యుద్ధం కావాలి
కత్తులతోనే కటార్లతోనో
లేదా తుపాకీ తూట్ల తోనో కాదు
విమర్శ అస్త్రాలు దాడులు చర్చలతో
కాలక్షేప సరదా మాటలతోనో కాదు
మార్పు అనే
ఓ ఆలోచన యుద్ధం కావాలి
అది నీలో నాలో ప్రతి ఒక్కరిలో మొదలవ్వాలి మనలో అందరిలో
భవిష్యత్ నిర్మాణ చైతన్యంకై
ఒక యుద్ధం మొదలవ్వాలి
75 ఏళ్ల స్వతంత్ర దేశ
భారత సగటు మనిషి
దరిద్ర బతుకు ముఖ చిత్రన్ని
కొత్తగా మార్చేందుందుకు
ఇప్పుడు ఒక యుద్ధం కావాలి
ఇంకా వంగి వత్తాసు పలికే
బాంచత్ దొర నీ కాలు మొక్కుతా
అనే గులాం గిరి నుండి విముక్తి
అనే ఓ యుద్ధం కావాలి
నవసమాజ నిర్మాణ ఆశయ సాధనకై
నీ వంతు ఒక బాధ్యత ప్రయత్న యుద్ధం కావాలి...!
ఓటు అనే ఆయుధంతో
నీ బతుకు రాతను మార్చే
మారే ఒక యుద్ధం కావాలి
రౌడీలు గుండాలు కరెప్షన్
లంచగుండి స్వార్ధపు వ్యక్తులు
తల్లి పాలు తాగి తల్లీ రొమ్మును
తన్నే నా కొడుకుల నుండి
నీవు నీ దేశాన్ని కాపేడేందుకు నీ వంతు
ఒక బాధ్యత పౌరడుగా ఒక యుద్ధం కావలి
ఇప్పుడు నీ బతుకు రాతను మార్చే
సామాన్యుడు ఓటు అనే ఆయుధంతో
నువో యుద్ధం చేయాలి
ఇప్పుడు ఒక యుద్ధం కావాలి
ఓటు అనే ఆయుధాన్ని వీరుడిగా
సంధిస్తూ ప్రలోభాలకు లొంగని
పవిత్ర రక్తాన్ని నీ దేహంలో పారిస్తూ
వెన్ను చూపని మడం తిప్పని
నీ దేశానికి ఒక జవానుగా
ఇప్పుడొక యుద్ధం కావాలి...!
గుర్తు పెట్టుకో ఇది నీ దేశం
ఇది నీ రక్తం ఇది నీ యుద్ధం
ఎవరో కొందరు పిన తండ్రి
రాజకీయ వారసులు కాదు
మార్పు నీతోనే ఈ యుద్ధం నీ తోనే
మారాల్సింది 3లక్షలు కూడ లేని
పరిపాలించే పాలకులు కాదు
130 కోట్ల జనాభా ఆలోచన...!!
మరల గుర్తు పెట్టుకో
ఈ యుద్ధం నీది
నీ బతుకు రాతను మార్చే
ఓటు అనే ఆయుధం నీది...!!
-సైదాచారి మండోజు