అది చాలు

Comments · 242 Views

అది చాలు,- సి.యస్.రాంబాబు

అది చాలు

కాంతి వెంటే ఉంటుంది
కంట పడదంతే

కాలం కదిలిపోతూనే ఉంటుంది
గమనించే తీరికుండదంతే

మాట జారుతూనే ఉంటాం
ఏం కాదన్న నిర్లక్ష్యం అంతే

"ఈగో" గుచ్చుతూనే ఉంటుంది
కానీ "ఈగోనే"యే గుర్తుంటుంది అంతే

ఫ్రెండ్ ను పలకరించాలనే అనుకుంటాము
అవసరంలేదన్న పంతం ఆపేస్తుంది అంతే

నేనూ నా అహం అంతే
అది చాలు

- సి.యస్.రాంబాబు

Comments