జాబిల్లి మీద ప్రయోగం - మాధవి కాళ్ల

Comments · 211 Views

జాబిల్లి మీద ప్రయోగం - మాధవి కాళ్ల జాబిల్లి మీద ప్రయోగం

జాబిల్లి మీద ప్రయోగం

రాత్రి , పగలు అని తేడా లేకుండా ఎంతో కృషి చేసి
చంద్రడి మీద ఎన్నో పరిశోధనలు చేసి
చంద్రయాన్ -3 ప్రయోగంతో ఒక కొత్త అధ్యయని ఇస్రో శ్రీకారం చుట్టారు..
ఈ ప్రయోగంతో మన దేశం గర్వించింది..
చంద్రుని మీద ఉన్న రహస్యాలను ఛేదించడానికి
ఒక కొత్త సాంకేతిక పరికరాలను అమర్చి ప్రయోగించారు..
జాబిల్లి వైపు వేస్తున్నా పరుగు విజయవంతం కావాలని అందరూ ప్రార్థనలు చేశారు..
ఎంతో మంది కృషి , పట్టుదల ఉండడం వల్ల
వాళ్ళ కష్టానికి ఫలితం దక్కలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
దేశంలో ప్రతి పౌరుడు గర్విస్తున్నారు..
మన శాస్త్రవేత్తలు ఆత్మవిశ్వాసానికి మన అందరం సెలుట్ చేయాలి..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఇది ఒక మైలురాయి అని చెప్పాలి..
వాళ్ళ కృషిని మన దేశం చిరకాలం గుర్తు పెట్టుకోవాలి..
ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను..
చందమామ మీద చెరగని ముద్ర చేయాలని అనుకుంటూ
జాబిలిని చేరడానికి మన దేశం చేసిన ప్రయత్నంలో ఇస్రో అరుదైన రికార్డుని అందుకుంది..
జాబిల్లి మీద చేసిన పరిశోధనా విజయవంతం కావాలని అందరూ కలలు కంటున్నారు..

- మాధవి కాళ్ల

Comments