చంద్రుడిని చూసొద్దాం పదండి
చంద్రునిపైకి మన భారతదేశం
పంపిన చంద్రయాన్.3 మనం
గర్వించే విధంగా చంద్రునిపై దిగింది.
మానవ రహిత కృత్రిమ ఉపగ్రహం చక్కగా
తన గమ్యస్థానానికి చేరింది.
ఈ ఘన విజయాన్ని సాధించిన
మన శాస్త్రవేత్తలకు వేల- వేల కృతజ్ఞతలు. భవిష్యత్తులో
భారతీయులు చంద్రునిపై
పాదం మోపే అదృష్టాన్ని
పొందబోతున్నారు. మనం
కూడా చంద్రునిపైకి వెళ్ళి
అక్కడి విశేషాలను చూసే
రోజు వస్తుంది. చంద్రునిపై
ఏమేమి ఖనిజాలు ఉన్నాయో,
అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను మనకు తెలిపే
ఆ కృత్రిమ ఉపగ్రహం మన
దేశానికే గర్వకారణం.
జై భారత్ అని మనమందరం
విజయగర్వంతో నినదిద్దాం.
- వెంకట భానుప్రసాద్ చలసాని