శుభవేళ

Comments · 258 Views

శుభవేళ-మాధవి కాళ్ల

శుభవేళ

 

నీతో వేసి ప్రతి అడుగు
నా నూరేళ్ళ జీవితానికి భరోసా ఇస్తూ
నింగి నేలలా మనం కలిసి
ఈ ప్రపంచం మొత్తం చుట్టేస్తూ
నీతో వేసి ప్రతి అడుగు

నా ఏడడుగుల బంధంలా
కావాలని
నా మనసు ఆరాటపడుతున్నా

క్షణం కోసం ఎదురు చూస్తూ
పంచభూతాల సాక్షిగా

మన పెళ్లి జరగాలని కోరుకుంటూ
నీతోనే నా జీవితకాల ప్రయాణం అని
ఏడేడు జన్మలు నీ చెయ్యి

పట్టుకుని నడవాలని
నువ్వు ఎప్పుడూ నాకు

తోడు నీడగా ఉండాలని
నువ్వు నా పక్కన ఉంటే

ఏదైనా సాధించగలను అనే నమ్మకంతో
నాలో దాగున్న ఈ ప్రేమకి
నువ్వు ఎప్పుడు బదులు చెప్తావా

అని ఎదురు చూస్తుంది నా మనసు
మన మనసులు కలిసిన శుభవేళ

కోసం ఎదురు చూస్తున్న
నీ మదిని అడగాలని

నా మనసు ఆరాటపడుతుంది...
మన పెళ్లి జరిగిన మరుక్షణాన

నీ చెయ్యి విడవకుండా పట్టుకుంటానని
ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ

నీ చేతిలో నా చెయ్యిని పెడుతున్నాను...
నీ చూపులో నామీద ప్రేమ కనిపించినా
ఎప్పుడు చెప్తావని ఎదురు చూస్తున్నా క్షణాన
నా మది తొందర పెడుతుంది...
మనం కలిసి శుభవేళ కోసం

ఎదురుచూస్తూ రోజులు గడుపుతున్నాను...

 

-మాధవి కాళ్ల

Comments