స్వాతంత్ర సిరులు - వింజరపు.శిరీష

Comments · 260 Views

స్వాతంత్ర సిరులు - వింజరపు.శిరీష

స్వాతంత్ర సిరులు

 

బానిస సంకెళ్లనుండి విముక్తికై పోరాటం
భరతమాత స్వేచ్చా వాయువుకై ఆరాటం
ఆణువణువూ దేశభక్తి నిండిన తపనలతో
మన్నులోన కలిసినారు వీరులందరో
మనకు తెచ్చిపెట్టినారు స్వాతంత్ర్యసిరులు

బానిసలుగా చేసినట్టి తెల్లదొరల వెళ్ళగొట్టి
సింగమల్లెదూకి తెగువ చూపినవారెందరో
ఆనాటి వీరులు త్యాగఫలము నేటి మన స్వాతంత్ర్యము
జై కొట్టరే జనులారా వారి త్యాగ కీర్తి మకుటానికి

రక్తమోడడు దేహలతో రక్కసిల రాక్షసత్వానికి

ఎదురునిలిచి స్వాతంత్రo తెచ్చిపెట్టినారు
స్వేచ్ఛావాయువులను వదిలినారు
జెండాల రెపరెపలో జాతి గుండియలో చిరంజీవులై నిలిచినారు

 

- వింజరపు.శిరీష

Comments