సాటి రాదు....

Comments · 193 Views

సాటి రాదు....- కొత్త ప్రియాంక (భానుప్రియ)సాటి రాదు....

సాటి రాదు....

ఉరుకుల పరుగుల జీవితం ఆనందం మొత్తం లక్షల సంపాదనలో స్టేటస్ లో ఉందనుకొని కాంక్రీట్ గోడల మధ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్ గా సాకేత్....

హోరైన సంగీతంతో రూమ్ అంతా మారుమోగుతుండగా తనదైన లోకంలో ఉషారైన స్టెప్పులు వేసుకుంటూ తన తలను తూడ్చుకుంటూ అలా స్టెప్పులు వేస్తునే తినడం, తయారవ్వడం పూర్తిచేసుకుని తన ఆఫీసుకి బయలుదేరాడు సాకేత్.

ఆఫీస్ వర్క్ ప్రాజెక్ట్స్ వాటి లోకంలోనే సాకేత్ ఎప్పుడు తల మునుకలై ఉంటాడు.

అనుకోకుండా ఒక రోజు సాకేత్ చిన్ననాటి స్నేహితుడు ఆఫీస్ పనిలో భాగంగా తన కంటపడతాడు.

"హాయ్ మహేష్ నువ్వా? ఎన్ని రోజులు అయింది రా? నిన్ను చూసి అని" చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సాకేత్, మహేష్ మాటలలో మునిగిపోతారు.

మహేష్ శనివారం కావడంతో సాకేత్ రూమ్ కి వెళ్లి మాట్లాడుతుండగా సాకేత్ ఈ 2 డేస్ హాలిడేస్ కదా నేను ఊరికి వెళుతున్నాను పద నువ్వు కూడా నాతో పాటుగా చాలా సరదాగా ఉంటుంది."

అని అసలు పల్లెటూరు ముఖమెరుగని సాకేత్ ని బలవంతం పైన తన ఊరికి తీసుకెళ్తాడు మహేష్.

సాకేత్, మహేష్ లు ఊరికి చేరుకునే లోపే సాయంత్రం అవ్వగా ఊర్లోని వాళ్ళందరూ ఆరు బయట కూర్చుని ముచ్చటించుకోవడం, అందమైన సూర్యాస్తమయం దృశ్యమాలికలు సాకేత్ ను ఆకట్టుకుంటాయి.

చీకటి పడగానే మహేష్ సాకేత్లు బయట కూర్చుని మాట్లాడుకుంటుండగా పసి పిల్లల తల్లులందరు పున్నమి వెన్నెలను చూపిస్తూ "చందమామ రావే జాబిల్లి రావే" అని తమ పిల్లలకు గోరుముద్దలు తినిపించడం సాకేత్ కు కొత్తగా అనిపించాయి.

మహేష్ బామ్మ పాల బువ్వ కలుపుకొచ్చి మహేష్ కి, సాకేత్ కి గోరుముద్దలు పెడుతుండగా మీరు ఎంత ఎదిగినా నాకు పసిపిల్లలే అని "వెన్నెల్లో పాల బువ్వ" ఎలా ఉంది? అని సాకేత్ ని అడిగగా

"బామ్మ నేను ఎంతో ఎన్నో గొప్ప రుచులను ఖరీదైన దేశాలలో ఎన్నో గొప్ప రుచులను తిన్నాను. కానీ ఈ వెన్నెల్లో పాల బువ్వ ను ఆస్వాదించినంతగా మరే రుచి ని నేను ఆస్వాదించలేదు. అని నేను ఈరోజు ఎప్పటికీ మరిచిపోలేను అని ఆనందంతో ఇదివరకు తన లోకంలో ఆనందం ఉన్న అనుభూతులు కరువయ్యాయని ఈ అనుభూతితో వెలకట్టలేనిది అని బామ్మను గట్టిగా హత్తుకుంటారు ఇద్దరూ... ఆనందం తో తిరిగి సిటీకి పయనం అవుతారు.

- కొత్త ప్రియాంక (భానుప్రియ)

Comments