భరతమాత ముద్దుబిడ్డలై
నా భారతదేశం ఒక నందన వనం...
అందులోని ప్రతి అనువనువు
కదిలే బృందావనాలు తలపెట్టిన వాడికి
మనస్సున వెలిగేటి మణిదీపాలు...
తూరుపున తేజమై కరిగేను హిమగిరి
సొగసుల పంటా...పడమరన
పొంగి పొరలె పరవళ్ళు తొక్కే పావన
నదీ జలపాతాలు...తడిసిన నేలంత
పరుచుకొనెను పచ్చధనాలు...
గలగలారావాలు ఎత్తు పల్లాలతో
చదును చేసిన పసిడి కాంతులను
ప్రాకారాలుగా కట్టిన సమితులు...
కలబోసిన ధాన్యపు రాసుల పై ఆ నిండు
పున్నమి వెన్నెల కురిపించేను చల్లని
దీవెనలు...
అన్ని మతాల సారమొక్కటే నని...
ప్రార్థించే అందరి మనస్సున దేవుడు
ఒక్కడే నని...శాంతి దూతలు
సత్యాన్వేషకులు జగమెరిగిన ధార్మికులు
మోకరిల్లిరి భరతమాత ముద్దుబిడ్డలై...
తరతరాల సాంప్రదాయమే
నిను నడిపించే జాతికి నిండు గౌరవమై
నడిచి వచ్చిన వేదభూమిగా మనస్సుల
స్వచ్ఛతను కదిలిస్తూ...ఖ్యాతి గాంచిన
ఘనచరిత్రల కీర్తి ప్రతిష్టలు ఆలాపించే
యుగళ గీతాలై వినిపించాలని...
నా భారతదేశం ఒక నందన వనం...
-దేరంగుల భైరవ