నిర్లక్ష్యం చేస్తే పోయేదే నీ ప్రాణం
రామారావు అనే కుర్రవాడు చాలా పేదవాడు మరియు నిరుపేద. తను కాలేజీకి వెళ్లడానికి బట్టలు లేకపోతే ఇరుగుపొరుగు వాళ్ళు ఇచ్చిన బట్టలు చిదిగినవి కుట్టించుకునే వేసుకుని వెళ్లేవాడు ,రోజు బాగా చదువుకోడానికి ఆశ పడుతూ ఉండేవాడు.
పాపం తన చదువుకోవడానికి తన వద్ద డబ్బులు లేవు, కానీ ఆ కుర్రవాడు ఉదయాన్నే లేచి సూర్యుడు ఉదయించక ముందు సైకిల్ తీసుకొని పేపర్ పట్టుకుని ఇంటింటికి వెళ్లి తన కాళ్లు అరిగేలా ఇంటింటికి పంపిణీ చేసేవాడు.
వాళ్ళు ఇచ్చిన డబ్బులతో నెలవారి తన పుస్తకాలు ఖర్చులు గా చూసుకుని చదవడం సాగించాడు . ఇలా కొన్నాళ్ళు గడిచింది.తన తల్లికి ఆరోగ్యం మందగించింది. తన తల్లి పేరు మృదుల మాత, అయితే తను ఏం చేయాలో తోచక చాలా తికమక్క పడ్డాడు.
ఇంతలో అతనికి ఒక మెరుపులాంచి ఆలోచన వచ్చింది . తను వెంటనే తన వద్ద ఉన్న పేపర్లో ఎవరెవరి ఇంటికి వేశాడు వారి ఇంట్లోకి నెలాఖరు వెళ్లి వసూలు చేసుకుని తిరిగి వాటిని మంచి కథలు సేకరించి వాటిని ఒక పుస్తకం లాగా తయారుచేసి 10 మంది సహకారంతో పూనుకున్నాడు.
దీనికి జగ్గారావు అనే ఊరు పెద్ద ఆర్థికంగా సహకరించారు. దీంతో రామారావు చాలా సంతోషించి తను ఆ కథల పుస్తకాలు ప్రతి పుస్తకాల షాపుల్లో అమ్మగా మిగిలినవి తన పేపర్ తో పాటు ప్రతి ఇంటికి ఒకటి చొప్పున అమ్మడం జరిగింది.
దాంతో ఒక పుస్తకం ఖరీదు వంద రూపాయలు మొత్తం పుస్తకాలు 350 ఇళ్లు కు అమ్మగా 35000 వచ్చింది మరియు షాపులకి పంచదా షాపులకి పంచగా 50,000 వచ్చింది డాక్టర్ గారి వద్దకు వెళ్లి డాక్టర్ శ్రీ హర్ష చెప్పిన ప్రకారం మందులు ఆపరేషన్ డబ్బులు సంపాదించగలిగాడు మగాడులాగా నిలబడ్డాడు.
కొంత డబ్బు వచ్చింది దానితో అతడు సంతోషించి వాళ్ళ అమ్మగారికి డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్లి ఆపరేషన్ చేయించడం జరిగినది . డాక్టర్ గారు తన తల్లికి 15000 ఖర్చు అవుతుంది అన్నారు ఆపరేషన్ చేయాలి తప్పకుండా చేయకపోతే మరణిస్తారు అని చెప్పగా, తనకి వేరే హోప్ దొరక ఈ విధమైన మార్గం ఎన్నుకున్నాడు .
మిగిలిన డబ్బులు తను వెంటనే తను ఏ స్థితి నుంచి పైకి వచ్చాడు, తెలుసుకునే వెంటనే తను శ్రీరామ అనాధ ఆశ్రమానికి మిగిలిన డబ్బులు ఇచ్చినాడు. ఇది చూసి ఊరి పెద్దలు జగ్గారావు చాలా సంతోషించాడు కాబట్టి డాక్టర్ గారు వైద్యం చేసి అతను ఆదుకున్నాడు .
జగ్గారావు గారు తను ఆర్థికంగా సహకరించి తన నిలబెట్టాడు. అమ్మగారికి నయం అయింది. ఎప్పుడైనా కష్టాల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తే ఆ విలువ మర్చిపోలేము .
అని తలుచుకునే ముందు రామారావు అలవాటుగా మార్చుకుని వచ్చిన డబ్బుల్ని పొదుపు చేసి అనేక పుస్తకాలు చేయడం మొదలుపెట్టాడు. దీంతో పీహెచ్డీ కూడా నెమ్మదిగా పూర్తయింది.
ఇంటి ఆర్థిక సమస్యలు తీరాయి. తను చాలా సంతోషించాడు. ఈ రోజుల్లో మగ పిల్లల చదువుకోవడం చాలా కష్టం. మార్కులు రావడం చాలా కష్టం. అటువంటిది తను ఇన్ని కష్టాల నుండి బయటికి రావడానికి రాత్రి - పగలు పేపర్ వేసి, పుస్తకాల అచ్చు వేసి, చక్కగా అందరి మనల్ని పొందాడు.
ఒక మంచి ఆలోచన మంచి మార్గాన్ని చూపుతుంది. ఒక మంచి మేధావి మంచి దారిలో నడవగలడు. ఒక మంచి ప్రయత్నం నిరంతరం మంచి దారిలో నడిపిస్తుంది.
అనడానికి ఈ కథ సాక్ష్యం. రామారావు నిర్లక్ష్యం చేసి తన తల్లికి మందులు ఇప్పించ లేక పోతే ఆమె మరణించేది, మరియు అనాధైపోయేవాడు. అని తెలుసుకుని చాలా సంతోషించాడు.
-యడ్ల శ్రీనివాసరావు