సాయి చరితం-179
పల్లవి
సాయమిచ్చే సాయి
వెలుగేమో చల్లుతాడు
అండగా ఉంటూనే
మార్గమే చూపుతాడు
చరణం
కొండంత కోరికలను
మన్నించి తీర్చువాడు
మారాము చేయు మమ్ము
దయతోటి మార్చువాడు
చరణం
చిరునవ్వుతోటి తాను
కష్టాలు తీర్చుతాడు
చలించు చిత్తమునకు
పగ్గాలు వేయువాడు
చరణం
తన నామమొక్కటే
మము నడిపించునుగా
తన చరితమొక్కటే
నీడగా నిలుచునుగా
చరణం
సాయేమో శాశ్వతము
మనమేమో గాలిపటం
తన బంధమొక్కటే
మన జీవన సూత్రం
-సి.యస్.రాంబాబు