ఇల్లాలు

Comments · 210 Views

ఇల్లాలు -ఉమాదేవి ఎర్రం

ఇల్లాలు

ఇంటికి దీపం ఇల్లాలు..
ఇంటిని చూసి ఇల్లాలిని..
చూడాలంటారు..
ఇల్లాలే ఆ ఇంటి దేవత..
అని కూడా అంటారు..
నిజమే మరి..
అందరి ఆకలి తీర్చే అమృతవల్లి..
ఒకింటి గారాల పట్టి..
ఇంకో ఇంటి అధ్బుతాల సృష్టి..
బాధలకోర్చి ఆ ఇంటిని తీర్చి దిద్దే.
సౌభాగ్యలక్ష్మి..
వారి వంశాలను మెాసి కని పెంచే..
నిండైన తల్లి..
కానీ...
ఈ కాలంలో అరుదుగా..
కనిపిస్తున్నారు..
దేవతలతో పోల్చే స్త్రీ జాతి..రాక్షసుల్లా మారుతున్నారు..
అంతా కాల మహిమ..

-ఉమాదేవి ఎర్రం

Comments