ప్రకృతి - హనుమంత

Bình luận · 261 Lượt xem

ప్రకృతి - హనుమంత

ప్రకృతి

ప్రకృతి అందాలు
ఆస్వాదిస్తే సంబరాలు
గాయపరిస్తే ప్రమాదాలు
భూమికి పెట్టని ఆభరణాలు
జీవజాతికి మూలాలు
కొలవని దైవాలు
మురిపించే అందాలు
నడిపించే ఇంధనాలు
వింతైన విశ్వంలో
అరుదైన చిత్రాలు
ఖరీదైన గనులు
అమూల్యమైన వనరులు
క్రియాశీల చర్యలు
క్రమానుగత కక్షలు
మొలకెత్తి పెద్దదై
నేలకొరిగి గనులై
మానవాళి అవసరాలకై
అంకితమైనవి...
భావితరాలకు అవసరం
మనతరానికి ఆసరాగా
వెనుకటికి ఆరాధించేదిగా
ప్రకృతి.

- హనుమంత

 

Bình luận