నిలకడ లేని మనసు
గాల్లో ఎగిరే పతంగిలా
కొమ్మ మీద గెంతే కోతిలా
చంగున ఎగిరే దూడలా
నిలకడ లేని మనసు...
ఉన్నది మరచి లేనిది తలచి
ఆర్బాటమనే ఆశల వలలో
ఉలిక్కిపడిరి ఊహను తలచి
నిలకడ లేని మనసుతో.....
మండే సూర్యుడు అస్తమించిన
ఆశల మనసు ఆగనంటూ
అటు ఇటు తూగుతూ
నిలకడ లేని మనసు....
ఆశలే ఇంధనంగా
సాదనే సాహసంగా
పడిలేచె వయస్సు లాగా
నిలకడ లేని మనసు.....
- హనుమంత