జీవితానికి కొత్త మలుపు

Comments · 159 Views

జీవితానికి కొత్త మలుపు -మాధవి కాళ్ల

జీవితానికి కొత్త మలుపు

                           

 

 మనోహర్ టెలికాలర్లో ఎంప్లాయ్ గా పని చేస్తుంది. ప్రతిరోజు కస్టమర్ తో మాట్లాడి వాళ్ళ కంపెనీ గురించి ప్రోడక్ట్స్ గురించి చెప్తూ ఉంటుంది. కొత్తగా వాళ్ళ ఆఫీస్ కి మేనేజర్ ప్రీతమ్ వచ్చాడు. అతనికి అమ్మాయి పిచ్చి ఎక్కువ. కానీ ఏ అమ్మాయి అయినా తన పడిపోవాల్సిందే అంత మాటకారి. అదే తెలిసి ఎం.డి. రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చిన మారలేదు నటించాడు.
అతి వినయంతోనే  హైదరాబాదులో ఉన్న బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. రాగానే అమ్మాయిలు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఎవరు బాగున్నారు అని చూడడం మొదలుపెట్టాడు. 
అందులో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ప్రీతమ్ అందానికే పడిపోయారు. అతని ఇలా అడగ్గానే అలా కాఫీ , సినిమాలకి ఒప్పుకున్నారు. 
మనోహరి కి ఎంతో కాలం నుంచి అఖిల్ ప్రేమిస్తున్నానని చెప్తూనే ఉన్నాడు. కానీ మనోహరి మాత్రం అతని ప్రేమని అతన్ని పట్టించుకోవడం లేదు. 
కొత్త మేనేజర్ వచ్చిన రోజు కూడా ఎప్పుడు ఇలాగే మనోహరి దగ్గరికి వెళ్లి ,
"మనోహరి నువ్వు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు?" అని సూటిగా అడిగాడు అఖిల్.
"నాకు పెళ్లి అన్న ప్రేమ అన్న ఇష్టం లేదు , నమ్మకం లేదు అందుకే నీ ప్రేమని నేను ఒప్పుకోవట్లేదు!" అని చెప్పేసి తాను కాల్స్ మాట్లాడుకునే పనిలో పడిపోయింది.
"నీకు ఎన్నిసార్లు చెప్పాను రా! నువ్వు వినిపించుకోవు కదా!" అని అన్నాడు సుబ్బు.
"ఆ అమ్మాయి నీకు పడదు అని , నేను ఎప్పటినుంచో చెప్తున్నాను?" అని అన్నాడు ప్రసాద్.
ఇలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా... ప్రీతమ్ వాళ్ళ దగ్గరకు వచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు.
"హాయ్! నా పేరు ప్రీతమ్" అని చెప్పాడు.
"హాయ్ సార్! నా పేరు సుబ్బు. ఇతను ప్రసాద్. అక్కడ దిగులుగా కూర్చొని ఉన్నాడే అతను అఖిల్" అని పరిచయం చేశాడు సుబ్బు.
"ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు?" అని అడిగాడు ప్రీతమ్.
"అఖిల్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి పొగరు ఎక్కువ అఖిల్ ప్రేమిస్తున్నాను అని వెంటపడుతుంటే , తనకి ప్రేమ పెళ్లి మీద నమ్మకం లేదు అని చెప్పి , తప్పించుకొని తిరుగుతుంది" అని కోపంగా చెప్పాడు ప్రసాద్. 
"అవునా! ఎవరు ఆ అమ్మాయి?" అని కొంచెం కుతూహలంగా అడిగాడు ప్రీతమ్.
"అదిగోండి సార్! అక్కడ కాల్స్ మాట్లాడుతుంది కదా! తానే పేరు మనోహరీ" అని చెప్పాడు సుబ్బు.
"అవునా! సరే ఇలా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా , మీ వర్క్ మీరు చూసుకోండి" అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రీతమ్.
మనోహరిని చూడగానే తనని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలి అని ప్లాన్లు వేయడం మొదలుపెట్టాడు ప్రీతమ్.
ప్రీతమ్ ఎన్ని రకాలుగా మాట్లాడాలని ప్రయత్నించిన మనోహరి నార్మల్ గా మాట్లాడేసి తన పని తను చూసుకుంటుంది.
ఇలా కాదు అని ఒక ప్లాన్ వేశాడు.  ఒక అన్నోన్ పర్సన్ గా ప్రతిరోజు ఉదయం మనోహర్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు.
కొన్ని రోజుల్లోనే వాళ్ళ మధ్యన చనువు పెరిగి స్నేహితులయ్యారు. వాళ్లతో మాట్లాడకు వీళ్ళతో మాట్లాడకు జాగ్రత్తగా ఉండు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పు నా పర్మిషన్ తీసుకో అని ఆర్డర్ వేయడం మొదలుపెట్టాడు ప్రీతమ్.
తనని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా...
ఒక టార్చర్ లాగా భావించింది మనోహరీ. 
అలా కొన్నాళ్ళు భరించి భరించి ఓపిక లేక అతని ఎదిరించడం మొదలుపెట్టింది. అప్పుడు అతను మనోహరిని భయపెట్టడం మొదలుపెట్టాడు. 
భయపెట్టడంతో కొన్నాళ్లు ఆరోగ్యం బాలేక ఆఫీస్ కి వెళ్లడం మానేసింది. 
అలా ఇంటి దగ్గర ఉంటే పిచ్చెక్కుతుందని , అప్పుడప్పుడు ప్రీతమ్ నుండి ఫోన్ వస్తే చాలు వణికి పోయేది. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ అక్క పిల్లలు చేసే పనులను చూసి కొంచెం మనసు స్థిమిత పడింది. 
అప్పుడే తన సమస్యకి మార్గం కూడా దొరికింది. 
అదే ధైర్యంతో ,
"అక్క నేను రేపటి నుంచి ఇంటికి వెళ్ళిపోతాను" అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది మనోహరి.
ఒకరోజు ధైర్యంగా ఆఫీస్ కి వెళ్ళింది. చూసిన వాళ్ళందరికీ మనోహరిని కొత్తగా చూస్తున్నట్టు అనిపించింది. 
ప్రీతమ్ మధ్యాహ్నం లంచ్ టైంలో ఫోన్ చేశాడు. భయపడుతుందో ఏమో అనుకొని లిఫ్ట్ చేయదేమో అనుకొని , తన రూమ్ లో ఉండి మనోహరిని గమనిస్తూ ఉన్నాడు. 
మొదట ఫోన్ స్క్రీన్ చూడగానే నవ్వు ఆపేసింది. తర్వాత నవ్వుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకెప్పుడైనా ఫోన్ చేస్తే మాత్రం నీ చావు నా చేతిలో ఉంది లేకపోతే నేనే చచ్చిపోయి నీ పేరు రాస్తాను అని బెదిరించగానే... ఫోన్ టక్కున పెట్టేసాడు ప్రీతమ్. 
"ఏంటి మనోహరి! ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావ్?" అని అడిగింది సుష్మ.
మనోహరి నవ్వుతూ ,
"నవోదయానికి నాంది పలికాను ఇప్పుడే , త్వరలోనే ముగింపు కూడా చెప్తాను" అని చెప్పింది.
తను చెప్పింది అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది సుష్మ. 
జీవితంలో ఏం జరిగినా సరే నవోదయానికి నాంది పలకండి అదే మీ జీవితానికి కొత్త మలుపు.

-మాధవి కాళ్ల..

Comments