భరతమాత సమావేశం - కోటేశ్వరరావు

Comments · 631 Views

భరతమాత సమావేశం - కోటేశ్వరరావు

భరతమాత సమావేశం

ఒకరోజు స్వర్గంలో దేవేంద్రుడు,భారతభూమికోసంతనువులుచాలించిన,స్వాతంత్ర సమరయోధులను పిలుస్తాడు,

అప్పుడు మన భారతదేశ స్వతంత్ర సమర యోధులు అందరూ దేవేంద్రుడు ఏర్పాటు చేసిన సభలోకి వస్తారు,

దేవేంద్రుడు వాళ్ళందరిని చూసి ఓ వీరులారా మీ అందరికీ ఒక వరం ఇచ్చెదను ఏం కావాలో కోరుకొనుము అని అంటాడు.

అప్పుడు అందరికీ ఆదర్శప్రాయుడైన మహాత్మా గాంధీ గారు లేచిఓ స్వర్గాధిపతి దేవేంద్ర మహారాజా... మేమందరం ఎప్పటినుండో మా తల్లి భరతమాత తో మాట్లాడాలి అనుకుంటున్నాం.

మా దేశం యొక్క విశేషాలు మా ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాం.

కనుక కొద్ది రోజుల్లో రాబోతున్న స్వతంత్ర దినోత్సవం నాడు సమావేశం ఏర్పాటు చేసి మా భరతమాతను ఆహ్వానిస్తారని గౌరవంగా కోరుకుంటున్నాము అని చెప్తారు.

కొన్ని రోజులు గడవగానే ఆగస్టు 15వ తేదీ రానే వచ్చింది,మన బడిలో పిల్లలు ఎలా అయితే స్వతంత్ర దినోత్సవం కోసం తరగతి గదులను,స్కూల్ ఆవరణాన్ని అలంకరణ చేస్తారో, అదేవిధంగా అక్కడ కూడా భరతమాత రాక కోసం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని రకరకాల పువ్వులు అలంకరణతో తల్లి రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

కొంత సమయానికిమువ్వన్నెల జెండా గల వస్త్రాన్ని ధరించినిండు ఆభరణాలుతో ధగ ధగా మెరిసిపోతూ
ఒక చేత త్రివర్ణ పతాకంమరొక చేత త్రిశూలంసూర్య దేవుని అంతటి తేజస్సుసంపూర్ణ చంద్రుడుకి ఉండే శాంతంఅగ్ని దేవుడు అంత రౌద్రంతోకదలి ముందుకు అడుగులు వేస్తుంటేదేవతల సైతం చేతులు జోడించి నమస్కారం పెడుతున్నారు.

తమ తల్లి భరతమాతను చూడగానే స్వతంత్ర యోధులందరూ సాష్టాంగ నమస్కారం చేశారు.

కనకపు సింహాసనం పైన ఉన్న భరతమాత మాట్లాడుతూఓ బిడ్డలారా మీ త్యాగం మరువలేనిది.
మీ నేల కోసం మీరు చేసిన పోరాటం వెలకట్టలేనిది,

ప్రాణాలు సైతం లెక్కచేయకుండా స్వాతంత్రo కోసం మీరు చేసిన ప్రాణత్యాగాలు వల్ల, ఈ రోజు ప్రపంచం అంతా ఒక నవ భారతాన్ని చూడగలుగుతుంది.

శాస్త్ర సాంకేతిక విభాగాల్లో ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడుతుంది.అతి తక్కువ ఖర్చుతోనే అంతరిక్ష ప్రయోగాలలో అద్భుతాలను సృష్టిస్తుంది.

రక్షణ రంగంలో గల త్రివిధ దళాలలో ప్రపంచంలోనే బలమైన శక్తిగా ముందుకు దూసుకుపోతుంది.
విద్య వైద్య రంగాలలో మనదైన ముద్ర వేస్తూ ప్రపంచానికి సరికొత్త ఒరవడిని చూపిస్తుంది.

స్వయం ప్రతిపత్తి కలిగిన,ప్రపంచంలోనే అతి పెద్ద సుదీర్ఘమైన, వివరనాత్మక, లిఖిత రాజ్యాంగంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళగలుగుతుంది.

ప్రపంచంలో ఏ దేశానికి లేని సంస్కృతి మన సొంతం,ఈనాటికీ అదే సంస్కృతిని కొనసాగిస్తూ, మానవ సంబంధాలలో విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థని కలిగి ఉన్నాం.

అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, మరిన్ని శిఖరాలను అధిరోహించి మరికొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచ అగ్రగామి దేశంగా ఏర్పాటు అవుతుంది.

వీటన్నింటికీ ప్రధాన కారణమైన మిమ్మల్ని సరిగా గుర్తించకపోవడం నాకు చాలా వేదన కలిగిస్తుంది.సంవత్సరానికి ఒకసారి వచ్చే స్వతంత్ర దినోత్సవం నాడు గుర్తు చేసుకుంటారు. మిగిలిన రోజులు గోడలుకు అతికించి పెడతారు.

ఎవరెవరో దోచుకున్న దొంగ రాజకీయ నాయకులు విగ్రహాలు ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటారు, ఆ స్థానంలో ఉండాల్సింది మీరు కదా?

నీ పోరాటాల స్ఫూర్తిని కేవలం పార్టీ పుస్తకాలకే పరిమితం చేసేస్తున్నారు.రాజకీయాల స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకోవడమే తప్ప మీ భావజాలాలను అలవరుచుకోవడం లేదనే బాధ అనునిత్యం ఉంటుంది.

ఎంత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నా సరే, రాజకీయ నాయకులు ఆడే చదరంగంలో ప్రజలు నలిగిపోతున్నారు, ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు, దోపిడి వ్యవస్థ, డబ్బు కోసం జరిగే హత్యలు, ఆగటం లేదు.

ఇలా భరతమాత ఒక్కసారిగా బాధపడుతూ చెప్పేసరికి, అందరూ కన్నీరు కారుస్తూ ఉంటారు.

అప్పుడు దేవేంద్రుడు వచ్చి

ఓ సమరయోధులారా ప్రతి విషయంలోనూ మంచి, చెడులు రెండు ఉంటాయి, అలాగే మీ దేశంలో కూడా మంచి తో పాటు చెడు కూడా ఉంటుంది.

కానీ రాబోయే రోజుల్లో చెడువ్యవస్థలన్నీ తొలగిపోయి భారతదేశం తేజోదివ్యమానంగా వెలిగి,ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది.

దేవేంద్రుడు ఈ మాటలు పలకగానే, అందరి మనసులు కుదుటపడి, భారతమాతకు ఘన ఘన జేజేలు పలుకుతూ, భారతమాతకు జై అంటూ వీడ్కోలు చెబుతారు.

- కోటేశ్వరరావు

Comments