శుభాకాంక్షలు - కిరీటి పుత్ర రామకూరి

Comments · 743 Views

శుభాకాంక్షలు - కిరీటి పుత్ర రామకూరి

శుభాకాంక్షలు

ఎన్నో తీపి జ్ఞాపకాలు..
మరెన్నో మధుర స్మృతులు..
ఇంకెన్నో చేదు అనుభవాలు..
వెరసి ఓ సంవత్సరకాలం సమాప్తం..

కొత్త కోరికలు..
సరికొత్త ఆశలు..
కొంగొత్త ఆశయాలు..
నూతన తత్త్వం తో నూతనోత్సాహం..

అందరూ బాగుండాలి..
అందులో మనముండాలి..
అదే కావాలి మన అభిమతం..
కొత్త సంవత్సరానికి ఇదే సాదర స్వాగతం..

తన మన పరివార సమేత సమూహానికి

ఇవే మా శుభాకాంక్షలు..

- కిరీటి పుత్ర రామకూరి

 

Comments