పనాయ్ తో పనయ్యింది. -గుండమిది కృష్ణమోహన్ 

Comments · 155 Views

పనాయ్ తో పనయ్యింది.  -గుండమిది కృష్ణమోహన్ 

పనాయ్ తో పనయ్యింది. 

ఓ మధ్య తరగతి కుటుంబం.ఆ ఇంటి ఇల్లాలు కనకలక్ష్మి గారు. తనకి ఆరుగురు సంతానము. వారితో పాటు వచ్చిపోయే వారితో ఇల్లు ఎప్పుడు సందడిగా ఉండేది. తనకు తన అన్నతమ్ముళ్లు ఏడుగురు వారు ఆగ్రామంలొనే ఉంటారు. వాళ్ళు వాళ్ళపిల్లలు కూడా తరచు వస్తూఉండేవారు. లేచింది మొదలు సాయంత్రం దాకా అందరికి వండి వడ్డించడంతోనే సరిపోయేది తనకి. ఒకరోజు వంట చేస్తుండగా వంటకు కావాల్సిన సరుకులు కొన్ని తక్కువైనాయి. పెద్దవాళ్ళందరూ పనికి వెళ్లారు. 
చిన్నపిల్లలందరు కలిసి ఇంటివెనకాల పెరట్లో అడ్డుకుంటున్నారు. అక్కడికి వెళ్లారు తాను దుకాణంకు ఎవరినైనా పంపుదామని చూస్తుంటే అందరూ ఆటలో మునిగిపోయివున్నారు. వారు కడలడం కష్టం అనిపించింది. ఏమిచేయాలా? అని ఆలోచిస్తూ చూస్తూ ఉండగా తన చూపు అక్కడే ఓపక్కన నిలిచి ఆటను చూస్తున్న తన తమ్ముని కొడుకు వద్దకు వెల్లింది. నెమ్మదిగా తన అల్లుడిని పిలిచి నువ్వు  కిరాణ షాపుకు వెళ్ళి సామాను తెస్తే నీకు పనాయ్ చేసిపెడతా అంది. పనాయ్ అంటే ఏంటి? అర్థం కాని ఆపిల్లవాడు ఇది ఒక కొత్త వంటకం అని ఆనందించి వెళ్తానని చెప్పి, వెళ్ళి సామను తీసుకొని వచ్చాడు.

తిరిగి పెరటీలోకి వెళ్లి ఆటచూస్తూ ఆటలో లీనమయ్యాడు . ఆటలో పడి సమయం తెలియలేదు తనకి సాయత్రం అయింది. సాయంత్రం తిరిగి ఇంటికి
వేళ్లే ముందు అత్తమ్మ చెప్పిన పనాయ్ గుర్తుకు వచ్చింది. 

పనాయ్ రుచి చూడాలని కుతూహలంగా వున్నాడు....తాను ఏమి ఆడగ కుండా  అత్తమ్మ వద్దకు వెళ్ళి కూర్చున్నాడు.  అది గమనించిన ఇల్లాలు వంటగదిలోకి వెళ్లి పది నిమిషాల్లో పాయసం చేసుకొని  వచ్చి బాలుని కి అందించింది. ఆ పిల్లవాడు పాయసం వంక అత్తమ్మ వంక చూసాడు. 

అత్తమ్మ అంది. ఇదేరా పనాయ్ తిను అని.

పాయసంలో  జీడిపప్పు, బాదం , కిస్మిస్
వేసి కలిపి అదే పనాయ్ అని చెప్పిందని. అప్పుడు అర్థమయ్యింది పిల్లవాడికి. తనలో తాను నవ్వుకుంటూ పాయసం తిన్నాడు.

అత్తమ్మ పిల్లలను నొప్పించకుండా అలా వారిలో ప్రేరణ కల్పించి పని చేయించడం. సేమియాను పనాయ్ గా మార్చి పిల్లలకు ఇచ్చి ఆనదింపచేయడం మంచి ఉపాయం గా తోచింది.

అలాగే ప్రతి తల్లి తన పిల్లలను నొప్పించకుండానే  పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు. తల్లిదండ్రులు పిల్లలతో నడుకునే తీరు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.

      ప్రస్తుతం తనలాగే తన పిల్లలు అందరూ ఎంతో ఓపికతో వారి వృత్తిలో నిపునతతో మంచి పేరు ప్రఖ్యాతులతో రాణిస్తున్నారు.

తల్లి పెంపకం పైనే పిల్లలజీవితాలు 80% ఆదరపడతాయనటానికి నిదర్శనం ఈ కథ.
        నిజంగా జరిగిన కథ

 

-గుండమిది కృష్ణమోహన్ 

Comments