అమ్మ ప్రేమ అజరామరమైనది బిడ్డ ఎలా ఉన్నా తన ప్రేమలో మాత్రం ఎలాంటి లోటు చూపించనది తల్లి ఒక్కతే,పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు బిడ్డ బాబు కోరేది తల్లి ఒక్కతే అలాంటి తల్లిని పూజించే రోజు ఈరోజు ఈ ఒక్క రోజైనా మీ అమ్మకి సెలవు ఇచ్చి ఆమెకు నచ్చిన ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెను సంతోషపరచండి.ఆమెకు నచ్చిన వంటలు చేసి పెట్టండి 24 గంటలు మీకోసం యంత్రంలా పనిచేసే అమ్మను ఈ ఒక్కరోజే కైనా సంతోషంగా ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఒక సామెత ఉంది తండ్రి పోయినా సరే తల్లి మాత్రం ఉండాలి అని ఎందుకంటే తల్లి అన్నిటికీ తట్టుకొని తన బిడ్డల్ని పోషిస్తుంది కాబట్టి అందువల్ల అమ్మ కోసం కాస్తంత సమయం వెచ్చించి ఈ ఒక్క రోజును మీ పనులన్నీ పక్కనపెట్టి ఆమెతో కాస్త సమయం గడపండి ఆమెను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక్కరోజు మీరు ఈ చేసిన పనికి ఆమె జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది అనే విషయం అసలు మర్చిపోవద్దు. అమ్మ ప్రేమ అంతులేనిది,అంతం కానిది.సృష్టిలో తీయనిది..లవ్ యూ అమ్మా
Search
Popular Posts