సారం-సంసారం -సి.యస్.రాంబాబు

Comments · 167 Views

సారం-సంసారం -సి.యస్.రాంబాబు

సారం-సంసారం

కదిలేనావలా కాలం
మెదిలే ఆలోచనలతో కలం 
పోటీపడుతుంటాయి బేరసారాలు లేకుండా 

అస్తవ్యస్తంగా జీవితం 
అపసవ్యంగా ప్రపంచం
నీరసించి ఉంటాయి నిత్యం 

సందిగ్ధంలో పాంచభౌతిక దేహం
సంపూర్ణత్వంతో పంచభూతాలు 
సంభాషిస్తుంటాయి అలుపు లేకుండా 

సవాళ్ళు సంశయాలతో 
మనిషి మనసులది 
అప్రకటిత యుద్ధం నిరంతరం 

ముప్పు తప్పు 
ఉప్పులాంటివి బతుక్కి 
ఎంత తక్కువయితే సుఖమన్న 
సారాన్ని బోధిస్తుంటాడు బాలభానుడు 

 

 

-సి.యస్.రాంబాబు

Comments