కల.. ఇక కలేనా??? - కిరీటి పుత్ర రామకూరి

نظرات · 204 بازدیدها

కల.. ఇక కలేనా??? - కిరీటి పుత్ర రామకూరి

కల.. ఇక కలేనా???

ఎవరో చెబితేనో వచ్చేది కాదు కల..
ఏదో చూస్తేనో వచ్చేది కాదు కల..

అందమైన కల
ప్రతి మనసు కనాల్సిందే..
ప్రతి మనిషిని కదిలించాలి చేసిందే.

జీవితం పై కల..
దాని సాధనకై శ్రమ కావాలి..

గమ్యం కై కల..
అది చేరడానికి పట్టుదల కావాలి..

ప్రేమ కై కల ..
‌స్పందించే హృదయాన్ని గెలవాలి..

కలలలో ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలు..

అందుకే అంటున్నా...
కల... కలగా మిగలరాదు..

కలను గ్రహించు.
దానిని జయించు..
కార్యసాధకునిగా జీవించు..

- కిరీటి పుత్ర రామకూరి

 

 

نظرات