అక్రమార్జన ఆబోతులకు
పీఠమిచ్చి పీడితుడవుకాకు
విజయమిచ్చి అవినీతిపరులకు
విషమ పరిస్థితులలో పడబోకు
నోటుకోసమని ఓటునమ్మకు
చేటగును నీకే అది మరువకు
సగటు ఓటరా!మేలుకోరా
దేశ భవితయన నీది కాదా?!
ఓటు అనునది నీకు హక్కురా
ఓటు వేయుట రీతి కదరా
ఉచిత పథకాల ఆశ యెందుకు?
బ్రతుకునంత మభ్యపెట్టుకోకు
ప్రగతి దారిలో నడుపు నేతను
ఎంచుకొనుటయే పాడి కాదా
స్థిర,చరముల ఆస్తి కాదిది
రాత మార్చే శక్తి అది నీకు
కుల,మతాల మత్తులో తూగకు
విత్తు వేయాలి భవ్య భవితకు
ఓటు వేయుము సవ్య ఏలికకు
పాటుపడుము మంచి కాలమునకు!
Aramak
popüler gönderiler
-
దాంపత్యo- వెంకట భానుప్రసాద్ చలసాని
Tarafından Aksharalipi Admin -
నాకు నచ్చిన గురువు
Tarafından Aksharalipi Admin -
కష్టాల కడలి,-మోటూరి శాంతకుమారి
Tarafından Aksharalipi Admin -
కప్పిపుచ్చుకోవటం -ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి
Tarafından Aksharalipi -
బ్రతుకు మాట - బంగారు పూల బాట - యడ్ల శ్రీనివాసరావు
Tarafından Aksharalipi Admin