అక్రమార్జన ఆబోతులకు
పీఠమిచ్చి పీడితుడవుకాకు
విజయమిచ్చి అవినీతిపరులకు
విషమ పరిస్థితులలో పడబోకు
నోటుకోసమని ఓటునమ్మకు
చేటగును నీకే అది మరువకు
సగటు ఓటరా!మేలుకోరా
దేశ భవితయన నీది కాదా?!
ఓటు అనునది నీకు హక్కురా
ఓటు వేయుట రీతి కదరా
ఉచిత పథకాల ఆశ యెందుకు?
బ్రతుకునంత మభ్యపెట్టుకోకు
ప్రగతి దారిలో నడుపు నేతను
ఎంచుకొనుటయే పాడి కాదా
స్థిర,చరముల ఆస్తి కాదిది
రాత మార్చే శక్తి అది నీకు
కుల,మతాల మత్తులో తూగకు
విత్తు వేయాలి భవ్య భవితకు
ఓటు వేయుము సవ్య ఏలికకు
పాటుపడుము మంచి కాలమునకు!
Sök
populära inlägg