మాట
పోటెత్తే కష్టాలు
ఊపిరిసలపని వ్యాపకాల మధ్య
నిన్ను నువ్వు కోల్పోతుంటావు !
నీదైన క్షణం నిను వెతుక్కుంటూ
వస్తుంది ఎపుడో
ఈలోగా నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావా లేదా అన్నదే ప్రశ్న !
మాటలకేం ఎవరైనా చెబుతారంటావేమో
మార్గనిర్దేశనం చేసేది మంచిమాటే అని మరువకు!
-సి.యస్.రాంబాబు