నూతన సంవత్సరానికి ఆహ్వానం
వచ్చింది వచ్చింది
నూతన సంవత్సరం వచ్చింది
ఎన్నో సందడిలను మరెన్నో సవాలను ఎదుర్కోవడానికి
వసంత కోకిల కుహు కుహు రాగాలతో
సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను ధైర్యంతో ఎదుర్కొంటూ
రుతువు మార్పు కారణంగా వచ్చే రోగాలను నివారించడానికి
షడ్రుచులు కలిసిన ఈ పచ్చడి తిని జీవిత పరమర్థాన్ని తెలుసుకుందాం..
గతమనే నిన్నటిని మార్చిపోతూ
ఊహ తెలియని రేపటి కోసం ఎదురు చూస్తూ
కొత్త ఆశలను మనంలో చిగురుంచుకుంటూ
కొత్త ఊహాలకు ఊపిరిని ఇస్తూ
ప్రేమ , ఆప్యాయతలను పెంచుకుంటూ
స్నేహ బంధాన్ని బల పడుచుకుంటూ
వచ్చిన నూతన సంవత్సరానికి నవ్వుతూ ఆహ్వానం పలుకుతూ
అనుభూతులతో నిత్యం నూతనంగా ఉండాలని కోరుకుంటూ
గుండెల్లో ఆనంద క్షణాలను నింపుకుంటూ
ఎంతో సంబరంగా సాంప్రదాయంగా జరుపుకుందాం ఈ ఉగాది పండుగని...
-మాధవి కాళ్ల..