దళిత హక్కులకై శ్రమించెను...!!!
ఆ కలం...
జాలువార్చిన కవణాలను ఎన్నో
గొంతుకలు పాడినా తనివి తీరని
పద మాధుర్యం అతనొక సైన్యం...
విరిగిన విమోచనాలతో నిండని విస్తరుకై
ఆశపడరాదని దళితత్త్వానికి ఆప్తుడై
అణగారిన విలువలకై పోరాడిన
నిత్య కృషీవలుడు కార్యసాధకుడు
మన కలేకూరి ప్రసాదన్న...
తరం మారిన ఆ స్వరం మారదు
మరిచిన సుప్తావస్థలను తట్టిలేపే...
ఎండని పూమాలికలు...
పిడికెడు ఆత్మగౌరవం కోసం తనదైన
జీవితం కోసం మరణం పీకమీద
కాలేసి నిలదీసే వైనమది...
కవిగా కార్యకర్తగా నాయకునిగా ఎన్నో
సంకలనాలతో ఉద్యమించెను...
దళిత సాహిత్యమై దర్భారులను
నిగ్గు తేల్చుతు తన రచనలతో
పేదవాడి గళాన్ని విప్పుతు...
కవితా సామ్రాజ్యానికి స్థాపకుడై నిలిచి
మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని తన
రెండు కళ్ళుగా చేసుకొని...
దళిత హక్కులకై శ్రమించెను...
ఉద్యమమంటే ఎగసిపడే
కెరటం కాదని ఎన్నో పత్రికలకు
సంపాదకత్వమై కంటిమీద కునుకు
నొదలి కవాతై నడుస్తు...
ప్రజానాట్య మండలికి వారసుడై
ప్రమిదల నెలిగిస్తు దళితుల నోటిలో
నాలుకనని అంతర్జాతీయ సదస్సులో
వివక్షతను వద్దన్న వినమృడు
కలేకూరి ప్రసాదన్నకు జోహరులు..
-దేరంగుల భైరవ (కర్నూలు)