అనుబంధం -సాహుసంధ్య

Comments · 268 Views

అనుబంధం -సాహుసంధ్య

అనుబంధం

అమ్మ లోని మొదటి అక్షరం "అ"
నాన్న లోని చివరి అక్షరం "న్న"
ఇద్దరి అనురాగాన్ని కలగలిపి
బాధ్యత తీసుకునే వారే అన్నయ్య
అన్న, చెల్లెళ ఇల్లు ఆనందాల హరివిల్లు చేసేది
తోడబుట్టిన బంధం
శ్రావణ పౌర్ణమి నాడు

అన్నాచెల్లెళ ను కలిపి ఒకటిగా చేసేను రాఖీ పండుగ
సోదరి, సోదరుల ఆనందాల వేడుక ఇది
అన్న, చెల్లెళ ఆత్మీయతకు జ్ఞాపిక ఇది
అక్క,తమ్ముళ్ళ అనురాగానికి విశిష్ట వేదిక ఇది
అందమైన బాల్యంలో అల్లరి చేష్టల బంధం ఇది
జన్మల జన్మల కు విడదీయలేని బంధం ఇది
అమ్మ,నాన్నల అనురాగం తో

ఆనందం మారిన శుభ తరుణం ఇది
తోడ బుట్టిన సోదరి,సోదారుల ఆనందాల దినం ఇది
దేవతల నుండి మానవులు దాకా,
తారతమ్యం లేని బంధం ఇది
దాని చిహ్నమే రాఖీ బంధనం!
ఈ "రాఖీ" పండుగ ఆత్మీయతకు పలకరింపు
నాటి నుండి నేటి వరకు బంధానికి కట్టుబడిన రక్ష భందనం
ఎన్నడూ తీరాని రుణానుబంధం
కనుకే జన్మ జన్మలకు అయింది రక్షణ కవచం

 

-సాహుసంధ్య

 

Comments