ప్రేమలోకం,-కొత్త ప్రియాంక (భానుప్రియ)

Comments · 1189 Views

ప్రేమలోకం,-కొత్త ప్రియాంక (భానుప్రియ)

ప్రేమలోకం

 

ఆకాశమే హద్దుగా

ఆంక్షాల అద్దులన్నీ

చెరిపేసి తీయని

ప్రేమలోకంలో

విహరిద్దామా నా చెలి...

ఏకాంతపు లోకంలో

తీయని భాషలెన్నో

చేసుకొని

ఊసలాడుకుందామా నా సఖియా...

అడుగడుగునా

ప్రేమపారవశ్యంతో

సాగిపోతూ

ఆస్వాదిద్దామా

అందమైన లోకాన్ని

ఓ ప్రియతమా...

చెట్ట పట్టాలేసుకొని

చిగురులు తొడిగిన

మన ప్రేమ మాధుర్యపు

సుమగందాన్ని

లోకమంతా పంచుదామా నా ప్రాణమా...

కడవరకు ఒకరికి

ఒకరమై ప్రేమంటే

మనమని గత చరిత్రకు

మన పవిత్ర అందాన్ని

ఆదర్శంగా అందిద్దామా

నా ప్రియ సఖియా!

 

-కొత్త ప్రియాంక (భానుప్రియ)

Comments