సరిచేద్దాం -సి.యస్.రాంబాబు

Comments · 467 Views

సరిచేద్దాం -సి.యస్.రాంబాబు

సరిచేద్దాం

నిన్న రేపుల మధ్య 
వేలాడుతున్న మనసు 
వర్తమానం వాకిలి తెరవటం మర్చిపోతుంది 
మనసంతే వర్తమానాన్ని ప్రేమించదు 
అంచనాలను మించక
సందిగ్ధమై నిలబడుతూ 
బతుకును నిలబెడుతుంది 
నిలదీద్దాం..
మనసును కప్పే మంచుపొరల్లో
కనిపించని కోణాలు 
త్రికోణమితి భాష్యాలు చెబుతుంటే
బతుకుకు తిర్యగ్రేఖ గీద్దాం 
వక్రరేఖలను సరిచేద్దాం..

 

-సి.యస్.రాంబాబు

Comments