మీరు దీన్ని అన్వేషిస్తున్నారు...?

Comments · 143 Views

మీరు దీన్ని అన్వేషిస్తున్నారు...?

చదువుతున్నాను...

చదువుతున్నాను... 

చదువుతున్నాను.... 

చదువుతూనే ఉన్నాను....

భగవద్గీత...

ఒక్క ముక్క అర్థం కాలేదు....

దాదాపు మొన్నటి వరకు....

ఈరోజు బాదలో ఉన్నాను.

"భగవద్గీత చదువు అన్నారు..."ఆత్మీయులు

చదివాను...

అంతరాత్మ మేల్కొంది...

"ప్రతి పుస్తకం ప్రశ్నించుకుంటూ చదవాలి..."అంది.

"సరే"అన్నాను

"ఎవరికోసం చదువుతున్నావ్?"ప్రశ్నించింది.

"నా కోసం"సమాధానం ఇచ్చాను.

"చదివితే కలిగే లాభం ఏమిటో తెలుసా?"

"తెలియదు... కానీ తెలుసుకుంటాను."

"తెలుసుకోవటం ఎందుకు?"

"నా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి...."

"నీకున్న సమస్యలు ఏవి?"

"ఉదాసీనత నా పెద్ద సమస్య"

"ఉదాసీనత అంటే ఏమిటో తెలుసా?"

"తెలుసు.."

"ఏమిటో చెప్పు..."

"నాకు ఎందుకులే అనే భావన... ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న... నేర్చుకుని ఏం చేస్తాను అనే నిరాశ వీటిని కలిపి ఉదాసీనత అంటారు" వివరించాను.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

"ఈ సమస్య జయించడానికి భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది?"ప్రశ్నించింది అంతరాత్మ.

"మనసు నిరుత్సాహానికి లోనవుతూ ఉంటుంది.

'నీ నిరుత్సాహానికి అర్థం లేదు నీలో ఉన్న శక్తి నీకు తెలియదు'అంటుంది భగవద్గీత.

సమస్య వస్తె ధైర్యం అదృశ్యమౌతుంది.

'ధైర్యం తెచ్చుకో పిరికితనం వదిలేయ్,'

ఎ పని చేయాలన్నా ఏదో భయం
ఫలితం రాదేమో...చెడు జరుగుతుందేమో
అనే భయం.

'ఉత్సాహంతో దేవుని మీద విశ్వాసం తో నీ కర్తవ్యాన్ని నిర్వహించు' అంటుంది భగవద్గీత ప్రేరణ కలిగి ప్రయత్నం మొదలు పెడతాను.

సుఖం లో విషయ వాంఛలో పడి కర్తవ్యం మరిచి పోతాను.

"నా కర్తవ్యం ఏమిటి?"అడుగుతాను నేను. భగవద్గీతతో

"నికు తెలియదా?"అంటుంది

"తెలియదు"

"అయితే తెలుసుకో "

"ఎలా?"

"నీ అత్మని అడుగు...చెపుతుంది.
అన్వేషించు.... అన్వేషిస్తే దోరాకనిది అంటూ లేదు" అంటుంది భగవద్గీత..

"నా వద్ద ఏం లేదు.... అనుభూతి లేదు... ఆనందం లేదు...సంతృప్తి లేదు"బాధతో అన్నాను.

చుట్టూ నిశబ్దంగా వుంది.

"సమాధానం కూడా లేదు...పోని సమస్య ఏమిటో తెలుసా? అదికూడా లేదు
కోపంగా ఉంది అందరినీ నిందిస్తున్నను"తిరిగి అన్నాను.

గుడిలో కూర్చుని ఉన్నాను.

ఎత్తైన కొండ పై వుంది శివాలయం.

చేతిలో భగవద్గీత వుంది.

హృదయంలో బాధ అశాంతి కోపం వున్నాయి.

నిశబ్దం చీలుస్తూ "కోపం ఎందుకు వస్తుందో తెలుసా?"వినిపించింది 

ఓ కంఠం బయట నుంచి వచ్చిందా?....అంతర్గతం నుంచి?

"తెలుసు"అన్నాను.

"చెప్పు... కారణం లేని పని ఏది జరగదు"తిరిగి వినిపించింది ఆ కంఠం నా లోపలి నుంచి వస్తుందని గమనించాను.

"కోరిక తీరాకపోతే కోపం వస్తుంది"సమాధానం చెపుతున్నట్లు అన్నాను.

" కోపంగా వుంది కదా?...ఏం కోరుకున్నావు?"ప్రశ్నించింది నా లోని కంఠం అంతరాత్మ?

"పర్ఫెక్ట్.... కనీసం సామాన్యుడిలా అయినా ఉండాలి అనికొరుకున్నను"

"ఎప్పుడు అలా ఆలోచించకు"అంది.

"ఎలా ఆలోచించాలి మరి?"ప్రశ్నించాను.

"సమస్యలో భాగంగా వుండకూడదు పరిష్కారం లో భాగంగా వుండేలా ఆలోచించాలి"

చెప్పటం తేలికే అనుకుంటూ మౌనంగా ధ్యానం చేశాను.

ఎత్తైన ప్రదేశం పై కూర్చుని ఉన్నాను అందుకేనేమో గాలి వేగంగా వీస్తుంది.

వాతావరణం చల్లగా ఉంది.

మనస్సు ప్రశాంతంగా ఉంది.

"ఇప్పుడు ఎలా ఉంది"ప్రశ్న వినిపించింది.నాలోని గొంతు.... అంతరాత్మ?

"చెయ్యటానికి పనిలేదు ఖాళీగా వున్నాను   కోపంగా ఉంది"అన్నాను.

"రాయటం ఒక పనె కదా?"

"గుర్తింపునిచ్చే పని కాదు"

"ఎలాంటి పని కావాలి నీకు?"

"నాకే తెలియదు"

"తెలుసుకో"

"ఎవరిని అడగాలి?"

"గూగుల్"

"చాలా సమాచారం ఉంది... కానీ నా బలాలు బలహీనతలు దృష్టిలో ఉంచుకుంటే ఏ పని నాకు సరిపోవటం లేదు" విచారంగా అన్నాను.

"ఏదో ఒక పని దొరుకుతుంది"దైర్యం చెపుతున్నట్లు వినిపించింది.

"నా దృష్టికి రచయిత ఒక పని దొరుకుతుంది" ఎంతో అన్వేషించాను లాభం లేక పోయింది అన్నట్లు ధ్వనించింది నా కంఠం.

"నీ మనసులో ఉన్న నమ్మకాలు అలాంటివి"

"దానికి నమ్మకానికి ఏమిటి సంబంధం?"

"ప్రతి పని నమ్మకాల ఆధారంగానే జరుగుతుంది...
మెదడు ముందు నమ్మకాలని సృష్టించి ఆ తర్వాత పని చెయ్యటం మొదలు పెడుతుంది."

"నిజమేనా?"

"నిజమేనా అనె ప్రశ్న ఎందుకు వచ్చింది?"

"ఏమో?"

"అదే మెదడు పనిచేసే విధానం...ఎది మంచి ఎది చెడు ఎది నిజం ఏది అబద్దం ప్రశ్నించి పరిశీలించి అనుభవాన్ని నమోదు చేసి నమ్మకాన్ని ఏర్పరుస్తుంది"వివరించింది అంతరాత్మ? భగవద్గీత.?

"నా నమ్మకాలని గుర్తించటం ఎలా?"

"ప్రశ్నించు..."

"ఎవరిని అడగాలి?"

"భగవద్గీతను"

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

"భగవద్గీత ఏమని చెపుతుంది?"

"నేను ఆత్మను అని చెపుతుంది"

"ఇది కూడా నమ్మకం?"

"అవును అన్నంటి కన్నా బలమైన నమ్మకం"

" ఈ నమ్మకం   ఏం చెపుతుంది?"

"విశ్వమంత నాదే అంటుంది"

" నాది అంటే?"

" ఆత్మది"

"ఆత్మ?"సందేహంగా అడిగాను.

"ఆత్మ ఓ శక్తి"

"దీనికి భగవద్గీతకు సంబందం ఏమిటి?"

"శూన్యంలో నుండి ఆత్మ పుట్టింది.శూన్యంలో  నుండే విశ్వం కూడా పుట్టింది. అంటుంది భగవద్గీత"

"అయితే?"

"నీలో నాలో కూడా ఆత్మ వుంది అంటాడు శ్రీ కృష్ణుడు"

"ఎందుకు అంటాడు?"

"కర్తవ్యం నిర్వర్తించాలి కాబట్టి"

"కర్తవ్యం?"

"ప్రతి మనిషి ఏదో ఒక పరిస్థితి లో జన్మిస్తాడు... పరిస్థితి బట్టి అతను  చెయ్యవలసిన పనులు కొన్ని  ఉంటాయి ఆ పనులే కర్తవ్యాలు"

"నా కర్తవ్యం ఏమిటి?"

"తెలుసుకో... నీ చుట్టు వున్న పరిసరాలు అన్వేషించు"

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

అన్వేషించి తెలుసుకున్నాను నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు కర్తవ్యాలు చాలా వున్నాయి కాని చెయ్యలేను అనిపిస్తుంది.

"నేను ఏపని చెయ్యలేను"అన్నాను.

"ఎందుకు చెయ్యలేవు?" ప్రశ్నిస్తుంది భగవద్గీత.

"నాకు తెలియదు...పని ప్రారంభిస్తాను. చెయ్యటానికి ప్రయత్నిస్తాను. పట్టుదలతో ముగింపు వరకు కొనసాగించాలేను. అది విఫలం అవుతుందని అనిపిస్తుంది.భయం కలుగుతుంది"

"అర్థం లేని భయం అది...నమ్మకం లేకపోవటం వల్ల అల అనిపిస్తుంది"

"మరి నమ్మకం వుంటే ఎలా అనిపిస్తుంది?"

"నమ్మకం అంటే పని ఫలితాన్ని పొందవచ్చు అనె ఆలోచన కలుగుతుంది. ఉపయోగం తప్పకుండా వుంటుంది అనె ఊహ కూడా కలుగుతుంది...దీన్నే విశ్వాసం అంటాము."

"అలాంటి నమ్మకం ఎలా కలుగుతుంది? "

"మానసిక దౌర్బల్యం వదిలించుకోవటం  నేను ఆత్మను అనుకోవటం వల్ల"

"కానీ నాకు ఆత్మ పై నమ్మకం లేదు"

"శక్తి వుందని నమ్ముతావా?"

"నమ్ముతాను"

"సరే నేను చెప్పేది పూర్తిగా విని నీ అభిప్రాయలు చెప్పు"

"తప్పకుండా"

"విశ్వం ఎలా పుట్టింది?"

"ఇప్పుడే చెప్పావు కదా శూన్యం నుంచి పుట్టిందని"

"నువ్వేం అనుకుంటున్నావు?"

"నేను చదివిన చదువు బిగ్ బ్యాంగ్ సిద్దాంతం నుంచి నాకు అర్థం ఐయినంతవరకు శూన్యం లో అణువు విస్పోటనం వల్ల విశ్వం పుట్టింది"

"అణువు పేలిపోయింది సరే ఏమయ్యింది ఆ తరువాత?"

"అణువు నుండి శక్తి విడుదల అయింది"

"ఆ శక్తి పేరు?"

"తెలియదు"

"రూపం?"

"లేదు"

"పోనీ లక్షణాలు?"

"లేవు"

"ఆ శక్తిని సృష్టించవచ్చా?"

"సృష్టించలేము"

"పోనీ నాశనం చేయవచ్ఛా?"

"చెయ్యలేము"

"ఆ శక్తిని నేను. నా పేరు  ఆత్మ  అంటే నమ్ముతావా?
ఆ శక్తి నువ్వు కూడా నిన్ను ఆత్మ అంటాను నమ్ముతావా?"భవద్గిత ప్రశ్నిస్తుంది.

నావద్ద మాటలు లేవు ఏదో చెప్పలేని అనభూతి.
శరీరంలో శక్తి ప్రవహిస్తున్నాట్లు అనిపిస్తుంది శరీరం నిటారుగా అయ్యింది.

మరింత శ్రద్ధగా వినటానికి చెవులు రిక్కించాను.

"బాగుంది...విశ్వం శూన్యంలో నుండి పుట్టింది...నేను(ఆత్మ?) శూన్యం నుంచి పుట్టాను
నేను విశ్వం సోదరులు అవుతాము?" నవ్వుతూ ప్రశ్నించాను. ఎంత వద్దు అనుకున్న వెక్కరిస్తున్నాట్లు ధ్వనించింది.

"నిజం"ప్రశాంతంగా వినిపించింది ఆ కంఠం.భవద్గిత

"నిజంగా?"

"ఆత్మకి  చావు లేదు..కానీ విశ్వం లో జరిగే ప్రతి పనిని నేను(ఆత్మ?) చేయగలను
విశ్వానికి నాశనం  లేదు నాకు(ఆత్మ?) నాశనం లేదు
ఆత్మ అన్ని పనులు చెయ్యగలదు... విచిత్రమైన విషయం  ఏమిటంటే అతీంద్రియ శక్తులు మనిషి జీవితంలో అవసరమే లేదు"అంది అంతరాత్మ...? భగద్గీత...?

"కానీ నాకు చాలా అవసరం"అన్నాను.

"ఎందుకు అవసరం?"

"నేను ఎన్నో సాధించాలి"

"ఏం సాధించాలి?"

"ప్రస్తుతానికి నాకే తెలియదు"

"తెలుసుకో  తెలుసుకుంటే ఆయా శక్తులు నిద్రావస్థలో వున్నవి మెలుకుంటాయి"

"ఎలా? ఎలా నిద్ర లేపాలి ఆ శక్తుల్ని?"

"చాలా సులభం నీకు ఎం కావాలో అడిగితే సరి"

"నాకు కావలసింది తెలిస్తే అందుతుందా?"

"తప్పకుండా"

"ఎలా. ఏం చేయాలి?"

"మెదడు ఓ అవయం ఆత్మకు సహాయం చేయటానికి ఏర్పడింది మెదడు చేసే అన్ని పనులకు కారణం వుంటుంది"

"ఏమిటా కారణం. ?"

"ఆనందమ్"

"ఆనందమా?"

"అవును"

"ఈ ఆనందం ఎవరిని ఉద్దేశించి?"

"ఆత్మను ఉద్దేశించింది"

"ఆత్మకి ఆనందానికి ఏమిటీ సంబందం?"

"నీకు శక్తులు కావాలి అన్నావు ఎందుకు? ఏమిటా నీ కోరికలు?"

"చాలా వున్నాయి"

"కోరిక ఎలా? కలుగుతుందో తెలుసా?"

"తెలియదు....దీనికి ఆత్మ కారణం ఏమో?"

"కోరిక అర్థం కావాలి అంటే ఆకర్షణ శక్తి గురించి తెలుసుకోవాలి "

"ఆకర్షణ శక్తి? ఒక వస్తువు మరో వస్తువుని ఆకర్షిస్తుంది ఆ శక్తి?"

" అదే... ఆ శక్తి గురించి తెలుసుకోవాలి ఈ ఆకర్షణ శక్తి విశ్వం పుట్టినప్పుడు ఆత్మతో పుట్టింది...దీన్ని మాయ అంటాను...విశ్వంలో మాయ లేని చోటు లేదు..."

"ఓ అణువు మరో అణువును ఆకర్షిస్తుంది"

"తెలుసు"

"ఆత్మశక్తి ఆకర్షణశక్తిగా మారుతుంది"

"మారిపోయి ఏం చేస్తుంది?"

"పంచభూతాలను సృష్టిస్తుంది"

"పంచ భూతాలను?...అంటే ఆకాశం...గాలి... నీరు...నెల... అగ్నీ????"

"అవే... ఈ పంచ భూతాల మిశ్రమం తోనే భూమిపై ప్రకృతి ఏర్పడింది"

"ప్రకృతి నుండి చెట్లు జీవాలు చివరికి మనిషి"మాట అందుకుని పూర్తి చేశాను.

"ఆత్మ మనస్సుని కూడా సృష్టించింది"

"ఎందుకు?"

"సృష్టి చేసేకొద్ది మంచి చెడు రెండు ఏర్పడ్డాయి
ఎది మంచి ఎది చెడు తెలుసు కోవటానికి 
జ్ఞానం అవసరం అందుకే మనస్సుని సృష్టించింది"

"ఆత్మ జ్ఞానాన్ని సృష్టించింది. బాగానే ఉంది కానీ  ఎందుకు సృష్టించింది."

"అదే కదా నువ్వు తెలుసుకోవాలి.. అదే కదా నీ ఆధ్యాత్మిక కర్తవ్యం నలుగురిని వివరించే విషయం కాదు అది"

"మరి?"

"అది అనుభవపూర్వకంగా ఎవరి వారు అన్వేషించి తెలుసుకోవాలి"

"అన్వేషించాలని లేదు... తెలుసుకోవాలని లేదు... ఇప్పుడు....?"నా మాటల్లో బద్దకం ప్రతి ధ్వనించింది.

"శక్తులు కావాలని అన్నావు?"

"అన్నాను"

"ఎలాగో తెలుసుకోవాలని లేదా?"

"వుంది"

"బద్ధకం వున్న వ్యక్తి దేన్నీ సాధించలేడు."

అప్పుడు అర్థమయింది.

ఆనందం కావాలన్న...

సంతృప్తి కలగాలన్న 

నేను చేయవలసిన మొదటి పని బద్దకాన్ని వదిలించు కోవటం.

రాదు లేదు కాదు వద్దు అనకుండా ప్రయత్నం చెయ్యటం

ఉపయోగపడేది నేర్చుకోవటం అని అర్థమైంది

జీవిత ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని నిరంతరం అన్వేషించడం నా పని నేను అన్వేషించే ఆ శక్తే...? ఆత్మ...? భగవంతుడు...? భక్తి...? మానవత్వం...? దీన్ని అన్వేషిస్తున్నాను...?

భగవద్గీత మూసి పక్కన పెట్టను. 

మీరు దీన్ని అన్వేషిస్తున్నారు...?

Comments