అక్కడెవరో ఉన్నారు
సముద్ర తీరంలో ఎవరో
దేవకన్య నిలుచుని ఉంది.
నేనెక్కడో చూసానామెను.
అలలకే సంగీతం నేర్పిస్తూ,
సాగరతీరంలో నిలుచుని
ఉన్న ఆమెను చూసానెక్కడో.
సముద్ర ఘోషలో సరిగమలు
పలికిస్తున్న ఆ సాగర కన్యను
ఎక్కడో చూసాను నేనెప్పుడో.
ఆ సంగీతంలో ఆర్ధ్రత ఉంది.
ఆ రాగల్లో ఒక శోకం ఉంది.
సాగరునికే కన్నీరు తెప్పించే
ఆమెను నేను చూసానెక్కడో.
ఎక్కడో చూసానని అనుకున్న
ఆమె నా కలల రాజకుమారి
అని నా కలలోనే తెలిసింది.
కలల అలలలో కొట్టుకుపోతూ
ఉన్న నాకు ఆమే స్వప్న సుందరి.
వెంకట భానుప్రసాద్ చలసాని