భావితరాలకు నిర్మాతలు మీరే...!!!
కుడిఎడమలు మనిషికైనా...
గెలుపోటములు ప్రయత్నపూరకాలే
ఓడిననాడు ఒలువబడుతు...
గెలిచిననాడు చిందులేయడం కాదు
ఆ రెంటిని సమపాళ్ళలో ఆస్వాదించే
అన్వయింపును నేర్చుకోవాలి...
దక్కని ఫలితం దిక్కులతో
జతకట్టి నిన్ను ఎక్కిరిస్తుందని...
మధన పడిన మదిని గాయం చేస్తూ...
వ్యర్థమని తనువులు తుంచుకోకండి
విశాల హృదయంతో ఆలోచించండి...
తల్లిదండ్రుల ఆశలను
వమ్ము చేయకండి నోచిన నోములకు
ప్రతి రూపాలు మీరే...
ఉడుకు రక్తంతో నిర్ణయం ఆవేశమై
నిలిచిన అడుగుపై నమ్మకం లేక
అగాయిత్యాలకు పూనుకోకండి
వేచిచూచిన విజయం మీదే...
ఒక్కసారి తప్పామని...
నూరేళ్ళ జీవితాన్ని కూల్చుకోవద్దు...
ఒక్క వెనకడుగుతో పది అడుగులు
ముందరికి దాటేసుకుపోవాలి...
సృజన చేసుకొన్నవారిగా భవిష్యత్
వ్యూహానికి అనుకూలపడితే
భావితరాలకు నిర్మాతలు మీరే....
-దేరంగుల భైరవ
Venkata Bhanu prasad Chalasani 36 w
కవిత బాగుంది.