సత్యమై కనబడుతూ...!!!
వెంబడించిన మనిషి ప్రయాణం
కులమతాల కోసం పోరాటం కాదని...
ఎరిగిన జాబితాలో అగ్రవర్ణాల
నియామకానికి రూపంగా బలిగొన్నవాడు
పేదవాడు కారాదని...
మారని వ్యవస్థలో మానవత్వమన్నది
అంటరానిదిగా స్థానాన్ని కోల్పోరాదని
నిశ్చయానికి నీరుపోసెను...
విసరేసినది చీకటైనా విత్తనంగా
మొలకవుతు బహుజన తత్త్వాన్ని
పోతపోసుకొన్న మనుషులై పొంతనలేని
అనాగరికతను విడనాడాలని...
వరదపారిన నీరుగా అణగారిన
బతుకులకు ముందడుగై ఉదయించే
సూర్యునిగా
కుల వివక్షతను కొనగోటితో గుచ్చెను...
ధ్యాన నిమగ్నతలో అంబేత్కరుని
వాక్కులు...
"సమీకరించు పోరాడు బోధించు"
అనే కంటి వెలుగులకు సత్యమై
కనబడుతు వెలుగు కాలేని ఉద్యమ
ఊపిరితో కలుపుకోలేని బంధం
విరిగిపోయిన విస్తరై...
గతులు తెలియని సంగతులతో
అమాయకాన్ని బలిచేయరాదని...
శ్రమించే వాదంతో కరాలను
పగుల్చుకొని కార్మికునిగా మిగలరాదని
అధికారాలతో ప్రాతిపదికలు కులాల
వర్గీకరణను నిర్మించరాదని...
కులం గొప్పతనం కాదని విషయమై
మాట్లాడిన ప్రతి స్పందన అవివేకానికి
దారని నిండని గర్వంతో ప్రజా సేవకు
అంకితమాయెను అంబేద్కర్...
దేరంగుల భైరవ
Venkata Bhanu prasad Chalasani 21 w
చాలా బాగా వ్రాసారు