పెళ్లికి ముందు సహ జీవనం అంటే

Comments · 173 Views

పెళ్లికి ముందు సహ జీవనం అంటే?   -ఉమాదేవి. ఎర్రం..

పెళ్లికి ముందు సహ జీవనం అంటే

 

కొన్ని విషయాల్లో బాగానే అనిపించినా  చాలా విషయాల్లోబాగుండదు..
బాగుండే విషయమేంటంటే ఒకరి నొకరు అర్థం చేసుకోవచ్చు ఒకరి ఇష్టాలు ఒకరు కనుక్కొని ముందు ముందు కలిసి జీవనం బాగా చేయచ్చు అలాగే నచ్చక పోతే విడిపోనూ వచ్చు..
ఇక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే..
ఒక తీయటి బంధం జీవితమంతా.
ఒకరికొకరు పరిచయం లేకపోయినా పెళ్లితోనే పరిచయం ఏర్పడినా తొలిసారి కలవడంలో ఒక మధురమైన అనుభూతి..
ఇద్దరిలో ఎవరికి కోపం వచ్చి విడిపోవాలనుకున్నా పెద్దలు కల్పించుకుని సర్థి చెప్పడంతో మళ్లీ యథావిధిగా జీవించడం జరుగుతుంది...
పిల్లలు పుట్టినా పెద్దల సహకారం చాలా ఎక్కువగా ఉండి ఒక పద్దతిగా పెరగడం వలన వారికి ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ తెలుస్తాయి..
కాబట్టి చాలా విషయాల్లో ఈ ( పెళ్లితో జరిగే సహజీవనమే బెస్ట్ ) అని నా ఉద్దేశం..

                ఉమాదేవి. ఎర్రం..

Comments