మేఘాలు
రష్మీ ఆగు రష్మీ అలా పరిగెత్తిస్తున్నావు? మేఘాలను అంటుకునేలా? నాకు ఓపిక లేదు బాబోయ్! అంటూ
రష్మి వెంట పరిగెడుతున్నాడు సుధీర్..
ఆ....ఆ...నేను దొరకనుగా! అంటూ అంతకెక్కువ పరిగెడుతుంది రష్మి..చివరకు చేయి పట్టుకుని ఆపాడు సుధీర్ ఎలాగోలా!
మీరిప్పుడే ఇలా నన్ను ఆపేస్తున్నారేంటి? ఇలా నా కోరికలన్నీ ఆకాశాన్నంటుతాయి తెలుసా?మీరవన్నీ తీర్చాలి అంది గోముగా!
అన్ని కోరికలు తీర్చడం నా వల్ల కాదనే నిన్నిలా ఆపుతున్నాను రష్మీ!నీలా నేను ఎక్కువ సంపాదించలేను నా జీవితంలో ఎంత సంపాదించ గలనో అంత లోనే గడప గలగాలి..
మంచం ఉన్నంతనే కాల్లు చాపుకోవాలి అంతే గానీకోరికలే గుర్రాలు కాకూడదు అన్నాడు సుధీర్..
ఎందుకండీ మీ కంత భయం? నా సంపాదన కూడాఉంటుంది కదా! అంది..నీ సంపాదన మీద నేను ఆధార పడలేను పెళ్లయ్యాకనువ్వు సంపాదించ గలవా? పిల్లలు పుడితే ఎలా సంపాదిస్తావు? అందుకే మీ ఆడవాల్ల మీద ఆధార పడడం సబబు కాదు కదా!
నాకున్న దాంట్లోనే మెదలాలి అన్నాడు.పెళ్లయ్యాక అంతే లెండి కాస్త ఇప్పుడైనా ఎంజాయ్
చేయనీయండి అని గల గలా నవ్వుతూ మళ్లీ పరిగెత్తుతుంది రష్మి..వెనుకే సుధీర్ నవ్వుతూ రష్మిని అందుకుంటున్నాడు..
-ఉమాదేవి ఎర్రం