వాన సంతకం

Kommentarer · 304 Visningar

వాన సంతకం -సి.యస్.రాంబాబు

వాన సంతకం

చల్లటిగాలి
చిరుతుంపరల దుప్పటి దులుపుతుంటే
అంబరం చినుకు వీణ శ్రుతి చేస్తుంటే 
అమృతవర్షిణి రాగం చెవిని చేరుతుంటే 
ఆనందం సంబరమై 
నేలను ముద్దాడుతుంటే
నిలకడగా నీలోని మనిషిది ఓ తృప్తిగీతం !
వర్షాకాలమే అంత 
తొలిసంధ్యపై వానజాణ నీటిచుక్కతో కన్నుగీటి
ఋతురాణి సంతకమై సంతసాన్ని
పుడమికి సమర్పణ చేస్తుంది
వాన నీ బతుక్కో ఆన అంటూ
ధరణి సందేశం దాచుకోదగ్గ ఆదేశం!

-సి.యస్.రాంబాబు

Kommentarer