ఇద్దరు ప్రాణాలను తీసింది
"ఏంటి నూర్జహాన్ ఇంత ఆలస్యమా! ఎంతసేపు నుంచి ఎదురు చూడాలి నీకోసం" అని అడిగాడు ప్రశాంత్.
"నీకు తెలుసు కదా! ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేసి రావడం ఎంత కష్టమో?" అని అంది నూర్జహాన్.
"మీ అన్నయ్యకి పెళ్లి ఎప్పుడు?" అని అడిగాడు ప్రశాంత్.
"రెండు రోజుల తర్వాత , ఆ పెళ్లికి వస్తున్నావు కదా!" అని అడిగింది నూర్జహాన్.
"మీ అన్నయ్య నన్ను స్పెషల్గా పిలిచాడు , తప్పకుండా వస్తాను" అని చెప్పాడు నవ్వుతూ ప్రశాంత్.
"ఇంట్లో వాళ్లకి తెలియక ముందే అన్నయ్యకి మన ప్రేమ విషయం చెప్పేయాలి , ఆ తర్వాత అన్నయ్య అంతా చూసుకుంటాడు" అని చెప్పింది నూర్జహాన్.
"సరే పెళ్లిలోనే చెప్పడానికి సిద్ధమవుతున్నాను. ఏం జరుగుతుందో చూడాలి?" అని చెప్పాడు ప్రశాంత్.
ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా... ఒక్కరు వాళ్ళ మాటలు వింటున్నారు. వాళ్ళిద్దర్నీ ఏదో చేయాలి అని ఆలోచిస్తున్నారు.
షాదుల్ , ప్రశాంత్ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. అప్పటినుండి నూర్జహాన్ ను ఇష్టపడడం మొదలుపెట్టాడు ప్రశాంత్.
రెండు రోజుల తర్వాత నూర్జహాన్ అన్నయ్య వాళ్ళ పెళ్లికి వచ్చాడు. తన ప్రేమ విషయం చెప్పాలి అనే పక్కకి పిలుచుకొని వెళ్తే , తన ఫోన్ రింగ్ అయింది.
అవతల వాళ్ళు చెప్పిన మాట విని కోపంతో రగిలిపోయాడు షాదుల్. ఆ కోపంలో ఉండగానే తన ప్రేమ విషయం చెప్తే ఏం జరుగుతుందో నా భయంతో చెప్పకుండా ఉండిపోయాడు ప్రశాంత్. అలా వాళ్ల పెళ్లి జరిగిపోయింది.
తన మరదలికి పెళ్లి ఉందని ఊరు వెళ్ళాడు ప్రశాంత్.
కానీ వారం రోజులు చెప్పి వెళ్లిన మూడు నెలల తర్వాత వచ్చాడు. అలా చుట్టుపక్కల వాళ్ళు ప్రశాంత్ తన మరదలు గురించి చెప్తున్న విషయాలు విని నిజం కాదేమో అనుకుంది నూర్జహాన్.
కానీ చిన్నప్పటి నుంచి తన మరదలు ప్రశాంత్ ను ప్రేమించడం వల్ల ,
"తనను తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఈ రాత్రికి ఎలాగోలాగా నీ దగ్గరికి వచ్చేస్తాను" అని మెసేజ్ చేశాడు ప్రశాంత్.
రెండు రోజుల తర్వాత ప్రశాంత్ తన మరదల్ని పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి ఎంతో కుమిలిపోయింది నూర్జహాన్.. ప్రశాంత్ ఫోన్ చేసిన కూడా లిఫ్ట్ చేయకుండా ఉంది. మెసేజ్ చేస్తే నీకు నాకు ఇంకా బ్రేకప్ అని చెప్పింది.
అలా ప్రశాంత్ ప్రేమని తలుచుకొని కుమిలిపోయి అనారోగ్యం పాలయ్యి చివరకు చనిపోయింది. నూర్జహాన్ చనిపోవడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తట్టుకోలేకపోయారు.
ఎలాగోలాగా నచ్చచెప్పి తన మరదలికి వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేసి వచ్చి చూస్తే నూర్జహాన్ చనిపోవడం తెలిసి కుప్పకూలిపోయి నాలుగు దిక్కులకు వినిపిచ్చేలా అరిచి ఏడ్చాడు.
నూర్జహాన్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత బాగా తాగేసి బైక్ మీద వస్తూ ఉండగా... యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇలా ఒక బ్రేకప్ ఇద్దరు ప్రాణాలను తెలిసింది.
-మాధవి కాళ్ల..
హామీ పత్రం :-
ఈ కథ నా సొంతమని హామీ ఇస్తున్నాను..